Hardik Pandya: కోహ్లీ కోసం తూటానైనా ఎదుర్కొనేవాడిని: హార్దిక్ పాండ్య
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లి కోసం తూటానైనా ఎదుర్కొనేవాడినని టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య అన్నాడు. ‘‘ప్రస్తుత టీమ్ఇండియాతో అనుబంధం చిరస్మరణీయం. ఈ బృందంతో సమయాన్ని ఎప్పటికీ ఆస్వాదిస్తా.
దుబాయ్: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లి కోసం తూటానైనా ఎదుర్కొనేవాడినని టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య అన్నాడు. ‘‘ప్రస్తుత టీమ్ఇండియాతో అనుబంధం చిరస్మరణీయం. ఈ బృందంతో సమయాన్ని ఎప్పటికీ ఆస్వాదిస్తా. బ్యాటింగ్ కోసం మైదానంలో అడుగుపెట్టినప్పుడు నీ (కోహ్లి) కోసం తూటాను ఎదుర్కోడానికైనా సిద్ధంగా ఉన్నా. ఆ సమయంలో నిన్ను ఔట్ కానివ్వదల్చుకోలేదు. అదే నా లక్ష్యం. ఎన్నో ఏళ్లుగా కీలక మ్యాచ్‌ల్లో చాలాసార్లు ఇలా ఆడావు. ఒత్తిడిని ఎదుర్కోవడంలో నీకంటే సమర్థుడు ఎవరూ లేరు’’ అని కోహ్లీని ఉద్దేశిస్తూ హార్దిక్ పేర్కొన్నాడు. కోహ్లి బాదిన రెండు సిక్సర్లు అతను మాత్రమే కొట్టగలడని తెలిపాడు. ‘‘నేను చాలా సిక్సర్లు కొట్టా. కాని కోహ్లి కొట్టిన ఆ రెండు సిక్సర్లు ఎంతో ప్రత్యేకం. నా హృదయంలో వాటిది ప్రత్యేకమైన స్థానం. ఆ సిక్సర్లు ఎంత ప్రత్యేకమో మా ఇద్దరికి తెలుసు. నేనెంతో క్రికెట్ ఆడా. కోహ్లి తప్ప మరెవరూ ఆ సిక్సర్లు కొట్టలేరు. ఆ ఇన్నింగ్స్‌లో మేమిద్దరం చాలా కష్టపడ్డాం. సునాయాసంగా గెలిచివుంటే ఇంత ప్రత్యేకం కాకపోయేది. మ్యాచ్‌కు ముందు జట్టులో చాలా ఒత్తిడి గమనించా. పెద్ద మ్యాచ్‌ల్లో చాలామంది ఒత్తిడిలో ఉంటారు. మేమంతా కలిసికట్టుగా ఎంతో కష్టపడ్డాం. ఒకరికొకరం అండగా ఉన్నాం. కాని నాలో ఎలాంటి భావోద్వేగాలు లేవు. మైదానంలో అడుగుపెట్టినప్పుడు సంతోషంగా ఉన్నా. ద్రవిడ్ సర్‌తో మాట్లాడినప్పుడు ‘‘ప్రశాంతంగా ఉండు’’ అని అన్నాడు. సర్, ఇక్కడ ఉన్నందుకు నేనెంతో ఆనందంగా ఉన్నానని అర్థం చేసుకోండి. 10 నెలల క్రితం గాయం నుంచి కోలుకునేందుకు ఎంతో శ్రమించాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నా.అని ద్రవిడ్ సర్‌కు చెప్పా’’ అని హార్దిక్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్‌లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్