Virat Kohli: కోహ్లీ కొట్టిన ఆ షాట్‌ చరిత్రలో నిలిచిపోతుంది: పాంటింగ్‌

పాకిస్థాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ హారిస్‌ రవూఫ్‌ బౌలింగ్‌లో విరాట్‌ కోహ్లి కొట్టిన స్ట్రైట్‌ సిక్సర్‌ టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో నిలిచిపోయే షాట్‌ అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అభివర్ణించాడు...

Updated : 08 Nov 2022 09:27 IST

మెల్‌బోర్న్‌: పాకిస్థాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ హారిస్‌ రవూఫ్‌ బౌలింగ్‌లో విరాట్‌ కోహ్లి కొట్టిన స్ట్రైట్‌ సిక్సర్‌ టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో నిలిచిపోయే షాట్‌ అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అభివర్ణించాడు. ‘‘హారిస్‌ రవూఫ్‌ బౌలింగ్‌లో అతడి తల మీదుగా విరాట్‌ కోహ్లి కొట్టిన సిక్సర్‌ను అభిమానులు మరిచిపోలేరు. ఈ షాట్‌ గురించి ఎప్పటికీ చెప్పుకుంటారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌ మొత్తంలోనే ఈ షాట్‌ గొప్పదని చెప్పట్లేదు కానీ టీ20 ప్రపంచకప్‌ వరకు వస్తే మాత్రం ఇది చరిత్రలో నిలిచిపోయే సిక్సరే. 19వ ఓవర్‌ చివరి రెండు బంతులకు కొట్టిన సిక్సర్లు ఆ మ్యాచ్‌లో ఎంత కీలమయ్యాయో అందరికి తెలుసు. ముఖ్యంగా తొలి సిక్సర్‌ మాత్రం అద్భుతం. లెంగ్త్‌ సరిగా దొరకకపోయినా.. సగం మాత్రమే బలంగా హిట్‌ చేసే అవకాశం ఉన్నా కూడా విరాట్‌ చాలా గొప్పగా బంతిని మిడిల్‌ చేస్తూ సిక్సర్‌ కొట్టేశాడు. బంతి బౌన్స్‌ను వాడుకుంటూ తనదైన నైపుణ్యంతో బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. విరాట్‌ ఫిట్‌నెస్‌ కూడా ఈ షాట్‌లో కీలకమైంది. ఆ షాట్‌ కొట్టేందుకు బలాన్నిచ్చింది అతడి ఫిట్‌నెసే. చాలా మంది బ్యాటర్లకు ఇది సాధ్యం కాదు.. ఎందుకంటే వారు కోహ్లి అంత ఫిట్‌గా లేరు’’ అని రికీ అన్నాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని