Ben stokes: సూర్యను కట్టడి చేస్తాం: బెన్ స్టోక్స్
భీకర ఫామ్‌లో ఉన్న టీమ్ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను కట్టడి చేస్తామని ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఆశాభావం వ్యక్తంజేశాడు.
అడిలైడ్: భీకర ఫామ్‌లో ఉన్న టీమ్ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను కట్టడి చేస్తామని ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఆశాభావం వ్యక్తంజేశాడు. తనను ఎప్పటికీ తక్కువ అంచనా వేయలేని హక్కును విరాట్ కోహ్లి సంపాదించుకున్నాడని స్టోక్స్ తెలిపాడు. ‘‘సూర్యకుమార్ అద్భుతమైన ఆటగాడు. అతను ఆడే కొన్ని షాట్లు చూస్తే తల పట్టుకుంటాం. మంచి ఫామ్‌లో ఉన్నాడు. మరో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడకుండా సూర్యను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తాం. కోహ్లి కొంతకాలం గొప్పగా ఆడకపోవడంతో అతడిని తక్కువ అంచనా వేశారు. అలా ఎందుకు చేశారో తెలియదు. కాని తనను ఎప్పటికీ తక్కువ అంచనా వేయలేని హక్కును కోహ్లి సంపాదించుకున్నాడు. మూడు ఫార్మాట్లలో కోహ్లి ఆడిన ఇన్నింగ్స్‌లు, అతడి గణాంకాలు మరెవరికీ సాధ్యంకావు. అత్యుత్తమ ఆటతీరు కనబరచకపోయినా ఈస్థాయికి చేరుకున్నాం. గురువారం నాటి మ్యాచ్‌లో మేం గెలవాలి. అత్యంత పటిష్టమైన టీమ్ఇండియాను ఎవరూ తేలిగ్గా తీసుకోలేరు’’ అని స్టోక్స్ పేర్కొన్నాడు.
అతడింతలా ఆడతాడనుకోలేదు... ఏబీ : సూర్యకుమార్ యాదవ్ ఈ స్థాయిలో ఆడతాడని అనుకోలేదని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. 360 డిగ్రీల ఆటతో సూర్య.. తాజా టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటిదాకా 5 మ్యాచ్‌ల్లో 193.97 స్ట్రైక్‌రేట్‌తో 225 పరుగులు సాధించిన నేపథ్యంలో ఏబీ ఇలా స్పందించాడు. ‘‘సూర్యను చూసి సంతోషిస్తున్నా. అతడు ఈ స్థాయిలో ఆడతాడని ఊహించలేదు. ఆరంభంలో చాలా సంప్రదాయబద్ధంగా ప్రణాళిక ప్రకారం బ్యాటింగ్ చేసేవాడు. ఇప్పుడు బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ దూకుడైన ఆటతో ఇన్నింగ్స్ నిర్మిస్తున్నాడు. సూర్యకు మంచి భవిష్యత్ ఉంది’’ అని ఏబీ పేర్కొన్నాడు. 360 డిగ్రీల ఆటగాడంటూ తనతో సూర్యను పోలికపెట్టడాన్ని అతడు సమర్థించాడు. ‘‘నాలాగే సూర్య ఆడుతున్నాడనడంలో తప్పేముంది. కానీ అతడు స్థిరంగా రాణించడంపై దృష్టి పెట్టాలి. మరో 5-10 ఏళ్లలో ఇలాగే చెలరేగితే క్రికెట్ చరిత్రలో సూర్య నిలిచిపోతాడు’’ డివిలియర్స్ చెప్పాడు. టీ20 ప్రపంచకప్‌లో నాకౌట్‌కు ముందు మరిన్ని మ్యాచ్‌లు ఉంటే బాగుండేదని ఏబీ అన్నాడు. ‘‘టీ20 ప్రపంచకప్‌లో పది జట్లు ప్రధాన టోర్నీలో పాల్గొంటే ప్రతి జట్టుకు 9 మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిస్తుంది. అప్పుడు టాప్-4 జట్లకు ఐపీఎల్ మాదిరే క్వాలిఫయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫయర్-2 నిర్వహిస్తే బాగుండేది’’ అని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్‌లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ