Surya Kumar Yadav: ఉత్తమ ఆటగాడు సూర్యనే: బట్లర్‌

ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో ఉత్తమ ఆటగాడిగా సూర్యకుమార్‌ యాదవ్‌కే తన ఓటని ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ చెప్పాడు. ‘‘నా దృష్టిలో ఈ టీ20 ప్రపంచకప్‌లో సూర్యనే ఉత్తమ ఆటగాడు.

Updated : 13 Nov 2022 08:17 IST

మెల్‌బోర్న్‌: ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో ఉత్తమ ఆటగాడిగా సూర్యకుమార్‌ యాదవ్‌కే తన ఓటని ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ చెప్పాడు. ‘‘నా దృష్టిలో ఈ టీ20 ప్రపంచకప్‌లో సూర్యనే ఉత్తమ ఆటగాడు. అతడు చాలా స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేశాడు. స్టార్లతో నిండిన భారత బ్యాటింగ్‌ లైనప్‌లో సూర్య ఆట అందర్ని కట్టిపడేసింది. స్కై ఆడిన తీరు అద్భుతం’’ అని బట్లర్‌ చెప్పాడు.

ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు సామ్‌ కరన్‌, అలెక్స్‌ హేల్స్‌ కూడా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ రేసులో ఉన్నారని,  పాకిస్థాన్‌తో ఫైనల్లో సత్తా చాటే ఆటగాడికి ఈ అవార్డు దక్కే అవకాశం ఉందన్నాడు. 189.68 స్ట్రైక్‌రేట్‌తో 239 పరుగులు చేసిన సూర్య టోర్నీలో అత్యధిక పరుగుల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. మరోవైపు బట్లర్‌ వ్యాఖ్యలతో పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ ఏకీభవించలేదు. తమ ఆల్‌రౌండర్‌ షాదాబ్‌ఖాన్‌కే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ దక్కుతుందన్నాడు. ఈ అవార్డు కోసం తొమ్మిది మందితో తుది జాబితాను ఐసీసీ ఎంపిక చేయగా ఇందులో ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌ ఆటగాళ్లే ఎక్కువమంది ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని