ఉరుగ్వే 0.. కొరియా 0
ఫుట్‌బాల్ ప్రపంచకప్ గ్రూప్ దశలో పెద్ద జట్ల సాధారణ ప్రదర్శన కొనసాగుతోంది. అర్జెంటీనా, జర్మనీ లాంటి మాజీ ఛాంపియన్లు చిన్న జట్ల చేతుల్లో కంగుతినగా.. కొన్ని పెద్ద జట్లు అతి కష్టం మీద గెలుస్తున్నాయి.
అల్రయాన్: ఫుట్‌బాల్ ప్రపంచకప్ గ్రూప్ దశలో పెద్ద జట్ల సాధారణ ప్రదర్శన కొనసాగుతోంది. అర్జెంటీనా, జర్మనీ లాంటి మాజీ ఛాంపియన్లు చిన్న జట్ల చేతుల్లో కంగుతినగా.. కొన్ని పెద్ద జట్లు అతి కష్టం మీద గెలుస్తున్నాయి. ఇంకొన్నేమో డ్రాలతో సరిపెట్టుకుంటున్నాయి. మాజీ ఛాంపియన్ ఉరుగ్వే కూడా గురువారం సాధారణంగానే ఆడింది. దక్షిణ కొరియాతో మ్యాచ్‌లో గోల్ కొట్టడంలో విఫలమైన ఆ జట్టు 0-0 డ్రాతో సరిపెట్టుకుంది. ఇరు జట్ల డిఫెన్స్ చురుగ్గా వ్యవహరించడంతో మ్యాచ్‌లో గోల్స్ నమోదు కాలేదు. ఆరంభం నుంచి చివరి దాకా ఉరుగ్వేకు దీటుగా నిలిచిన కొరియా.. గోల్ అవకాశాలను బాగానే సృష్టించుకుంది. కంటి గాయంతో మాస్క్ వేసుకుని మ్యాచ్ ఆడిన సాన్ హువాంగ్ ఉరుగ్వేను బాగానే ఒత్తిడికి గురి చేశాడు. గోల్ చేయడానికి ఉరుగ్వేకు 43, 89 నిమిషాల్లో మంచి అవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్‌కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ