మెస్సి ఆట చూడాలని కారులో ఒంటరిగా

కేరళకు చెందిన అయిదుగురు పిల్లల తల్లి నాజి నోషి.. ఫుట్‌బాల్‌ దిగ్గజం మెస్సీకి వీరాభిమాని.

Published : 27 Nov 2022 01:52 IST

దుబాయ్‌: కేరళకు చెందిన అయిదుగురు పిల్లల తల్లి నాజి నోషి.. ఫుట్‌బాల్‌ దిగ్గజం మెస్సీకి వీరాభిమాని. ఫిఫా ప్రపంచకప్‌లో అతని ఆట చూడాలని ఖతార్‌ బయల్దేరింది. కానీ అందరిలాగా కాదు. తన కారులో ఖతార్‌కు ప్రయాణిస్తోంది. ముంబయి నుంచి ఒమన్‌కు కారును తరలించిన ఆమె.. ఇప్పుడు యూఏఈలో చక్కర్లు కొడుతోంది. గత నెల 15న కేరళ నుంచి ప్రయాణం మొదలెట్టింది. మార్గ మధ్యలో వంట చేసుకునేందుకు వీలుగా తనతో పాటు బియ్యం, నీళ్లు, పిండి, సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్లింది. తన ఎస్‌యూవీ కారులోనే చిన్నపాటి వంటశాలను ఏర్పాటు చేసుకుంది. కారు పైన టెంటును అమర్చుకుంది. వీలైనంత వరకూ వంట చేసుకునేందుకే ప్రయత్నిస్తానని, దీంతో ఖర్చు కలిసి రావడంతో పాటు విషాహారం బారిన పడే ప్రమాదం ఉండదని ఆమె చెప్పింది. దుబాయ్‌లో బుర్జ్‌ ఖలీఫాను సందర్శించిన ఆమె.. ఈ ప్రయాణం మొదలెట్టినప్పుడే దీన్ని చూడాలని అనుకున్నట్లు తెలిపింది. ‘‘నా హీరో మెస్సి ఆటను చూడాలనేది నా కోరిక. సౌదీ అరేబియా చేతిలో అర్జెంటీనా ఓటమితో నా హృదయం బద్దలైంది. కానీ కప్పు గెలిచే దిశగా ఇదో చిన్న కుదుపు మాత్రమే’’ అని ఆమె చెప్పింది. తన కారును ముద్దుగా ‘‘ఊలు’’ అని పిలుచుకుంటున్నట్లు వెల్లడించింది. దీనికి ‘‘ఆమె’’ అని అర్థం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని