దేశం కోసం మళ్లీ వస్తా

గాయం నుంచి కోలుకుని దేశం కోసం మళ్లీ బరిలో దిగుతానని ఆశాభావం వ్యక్తం చేశాడు బ్రెజిల్‌ స్టార్‌ నెయ్‌మార్‌.

Published : 28 Nov 2022 01:46 IST

దోహా: గాయం నుంచి కోలుకుని దేశం కోసం మళ్లీ బరిలో దిగుతానని ఆశాభావం వ్యక్తం చేశాడు బ్రెజిల్‌ స్టార్‌ నెయ్‌మార్‌. ప్రపంచకప్‌లో సెర్బియాతో తొలి మ్యాచ్‌లో ఈ స్ట్రైకర్‌ చీలమండకు గాయమైంది. దీంతో గ్రూప్‌ దశ మ్యాచ్‌లకు అతడు దూరమయ్యాడు. గాయమైన చీలమండ ఫొటోను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న నెయ్‌మార్‌ ‘అత్యంత క్లిష్టమైన ఘడియలు’ అనే శీర్షిక జోడించాడు. ‘‘గాయపడ్డాను. బాధగా ఉంది. ఆడలేకపోతున్నందుకు వేదనగా అనిపిస్తోంది. కానీ త్వరలోనే మళ్లీ తిరిగొస్తా. ఎందుకంటే దేశం కోసం.. నా సహచరుల కోసం ఏదైనా చేయగలననిపిస్తోంది. జీవితంలో నాకేదీ తేలిగ్గా దక్కలేదు. కలలను వెంటాడుతూ సాకారం చేసుకున్నా’’ అని నెయ్‌మార్‌ అన్నాడు. స్విట్జర్లాండ్‌తో బ్రెజిల్‌ ఆడే తర్వాత మ్యాచ్‌కు నెయ్‌మార్‌ దూరం కావడంతో అతడి స్థానంలో ఎవరు బరిలో దిగుతారనేది కోచ్‌ టైట్‌ ఇంకా ప్రకటించలేదు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు