88,966 మంది ప్రేక్షకుల సమక్షంలో..

అర్జెంటీనా దిగ్గజం లియోనెల్‌ మెస్సికి ఉండే ఆదరణ ఎలాంటిదో మరోసారి వెల్లడైంది. ఆదివారం అర్జెంటీనా, మెక్సికో జట్ల మధ్య మ్యాచ్‌ను అభిమానం ముంచెత్తింది.

Published : 28 Nov 2022 01:47 IST

లుసైల్‌ (ఖతార్‌): అర్జెంటీనా దిగ్గజం లియోనెల్‌ మెస్సికి ఉండే ఆదరణ ఎలాంటిదో మరోసారి వెల్లడైంది. ఆదివారం అర్జెంటీనా, మెక్సికో జట్ల మధ్య మ్యాచ్‌ను అభిమానం ముంచెత్తింది. గత 28 ఏళ్ల ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధికంగా ప్రేక్షకులు ఉత్తర దోహాలోని లుసైల్‌ స్టేడియానికి పోటెత్తారు. అర్జెంటీనా 2-0తో మెక్సికోను చిత్తుచేసిన ఈ మ్యాచ్‌ను 88,966 మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా వీక్షించారు. ప్రపంచకప్‌లో ఓ మ్యాచ్‌కు గత 28 ఏళ్లలో అత్యధిక ప్రేక్షకుల సంఖ్య ఇదే. 1994లో అమెరికా ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌లో బ్రెజిల్‌, ఇటలీ మధ్య ఫైనల్‌ను 91,194 మంది ప్రేక్షకులు వీక్షించారు. ఆ మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్‌లో ఇటలీపై బ్రెజిల్‌ గెలిచింది. 1950లో రియో డి జెనీరో లోని మారాకాన స్టేడియంలో ఉరుగ్వే, బ్రెజిల్‌ మధ్య ఫైనల్‌ను అత్యధికంగా 1,73,850 మంది ప్రేక్షకులు చూశారు. ఫుట్‌బాల్‌ చరిత్రలో అత్యధిక ప్రేక్షకుల సంఖ్య ఇదే. ఆ మ్యాచ్‌లో ఉరుగ్వే 2-1తో ఆతిథ్య బ్రెజిల్‌పై విజయం సాధించింది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు