బెల్జియంకు షాక్.. మొరాకో సంచలనం
ప్రపంచకప్‌లో మరో సంచలనం. జర్మనీ, అర్జెంటీనా బాటలో మరో అగ్ర జట్టు మట్టికరిచింది. స్టార్లతో నిండిన ప్రపంచ నంబర్ 2 బెల్జియంకు షాక్.
దోహా
ప్రపంచకప్‌లో మరో సంచలనం. జర్మనీ, అర్జెంటీనా బాటలో మరో అగ్ర జట్టు మట్టికరిచింది. స్టార్లతో నిండిన ప్రపంచ నంబర్ 2 బెల్జియంకు షాక్. అనూహ్య ప్రదర్శనతో అదరగొట్టిన మొరాకో.. 2-0తో రెడ్‌డెవిల్స్‌ను కొట్టేసింది. సబ్‌స్టిట్యూట్ సబిరి మొరాకో హీరో.
బెల్జియంకు దిమ్మదిరిగే షాక్. ఆ జట్టు ప్రపంచకప్ ఆశలను మొరాకో అనిశ్చితిలో పడేసింది. తన తొలి మ్యాచ్‌లో నెగ్గిన బెల్జియం.. ఈ రెండో మ్యాచ్‌లో గెలిస్తే నాకౌట్లో అడుగుపెట్టేదే. కానీ ఆదివారం మొరాకో అందరినీ ఆశ్చర్యపరుస్తూ 2-0తో బెల్జియంను ఓడించింది. ఇద్దరు సబ్‌స్టిట్యూట్లు ఆటగాళ్లు సబిరి (73వ), అబౌక్లాల్ (90+2) మొరాకోకు గోల్స్ అందించారు. తొలి మ్యాచ్‌లో క్రొయేషియాతో డ్రా చేసుకున్న మొరాకో గ్రూప్-ఎఫ్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ప్రపంచకప్ చరిత్రలో అ జట్టుకిది మూడో విజయం మాత్రమే. 1998 ప్రపంచకప్ తర్వాత మొదటిది. మొరాకో తన చివరి మ్యాచ్‌లో గురువారం కెనడాతో కనీసం డ్రా చేసుకున్నా.. నాకౌట్‌కు చేరే అవకాశం ఉంది. ఇక బెల్జియం ముందంజ వేయాలంటే తన చివరి మ్యాచ్‌లో గత ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషియాపై తప్పక నెగ్గాల్సిందే.
బెల్జియం పేలవంగా..: తన తొలి మ్యాచ్‌లో కెనడాపై కష్టంగా 1-0తో గెలిచిన బెల్జియం మరోసారి పేలవ ప్రదర్శన చేసింది. ప్రత్యర్థికన్నా రెట్టింపు సమయం బంతిని తన నియంత్రణలో ఉంచుకున్నా ఫలితం లేకపోయింది. ఆ జట్టు స్టార్ డిబ్రుయిన్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఎడెన్ హజార్డ్ కూడా ప్రభావం చూపలేదు. బంతిని ఎక్కువగా అధీనంలో ఉంచుకున్నా.. బెల్జియం ఎటాక్ చేయలేకపోయింది. ఆరంభంలో కాస్త ఒత్తిడికి గురైనా.. మొరాకో క్రమంగా పుంజుకుంది. నిజానికి ఆ జట్టు విరామానికి ముందే ఆధిక్యంలోకి వెళ్లినంత పనిచేసింది. తొలి అర్ధభాగం ఆఖర్లో పెనాల్టీ ప్రాంతానికి కాస్త ఆవల తొర్గాన్ హజార్డ్ ఫౌల్ చేయడంతో మొరాకోకు ఫ్రీకిక్ లభించింది. జియెచ్ ఫ్రీకిక్.. బెల్జియం గోల్‌కీపర్ కోర్టాయిస్‌ను బోల్తా కొట్టిస్తూ నెట్లో పడింది. కానీ అది ఆఫ్‌సైడ్ కావడంతో మొరాకోకు నిరాశ తప్పలేదు. అయితే ఆత్మవిశ్వాసం పెరిగిన మొరాకో ద్వితీయార్ధంలో మరింత ఎటాకింగ్ చేసింది. బెల్జియం బాక్స్ లోపలి నుంచి బౌఫాల్ కొట్టిన షాట్ దూరంగా వెళ్లింది. బెల్జియం కూడా కొన్ని ప్రయత్నాలు చేసింది. 73వ నిమిషంలో ఆ జట్టుకు షాక్ తగిలింది. టచ్ లైన్ సమీపం నుంచి సబిరి కొట్టిన ఫ్రీకిక్.. బెల్జియం గోల్‌కీపర్‌కు అందకుండా నెట్లో పడింది. ఈ మెరుపు గోల్‌తో స్టేడియం హోరెత్తింది. మొరాకో జట్టు సంబరాలు మునిగిపోయింది. ఆ తర్వాత స్కోరు సమం చేయడానికి బెల్జియం తీవ్రంగా ప్రయత్నించింది. చివరి పది నిమిషాల్లో గాయంతో బాధపడుతున్న లుకాకును బరిలోకి దించినా ఫలితం లేకపోయింది. మొరాకో గట్టిగా పోరాడింది. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. పైగా ఇంజురీ సమయంలో అబౌక్లాల్ కొట్టిన గోల్‌తో ఆధిక్యాన్ని 2-0కు పెంచుకుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
GPS: జీపీఎస్ మార్గదర్శకాలు వెల్లడించాలి: సీపీఎస్ అసోసియేషన్ డిమాండ్
-
Politics News
TDP: మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయి.. గవర్నర్‌కు తెదేపా ఫిర్యాదు
-
Crime News
Mumbai Murder: దుర్వాసన వస్తుంటే.. స్ప్రేకొట్టి తలుపుతీశాడు: ముంబయి హత్యను గుర్తించారిలా..!
-
General News
Bopparaju: 37 డిమాండ్లు సాధించాం.. ఉద్యమం విరమిస్తున్నాం: బొప్పరాజు వెంకటేశ్వర్లు
-
Movies News
Siddharth: ఆమెను చూడగానే ఒక్కసారిగా ఏడ్చేసిన హీరో సిద్ధార్థ్
-
Movies News
Chiranjeevi: ‘భోళా శంకర్’ నుంచి మరో లీక్.. ఫ్యాన్స్‌తో షేర్ చేసిన చిరు