పరాగ్‌ మెరుపు శతకం.. క్వార్టర్స్‌లో అస్సాం

రియాన్‌ పరాగ్‌ (174; 116 బంతుల్లో 12×4, 12×6) మెరుపు శతకంతో సత్తాచాటడంతో విజయ్‌ హజారె ట్రోఫీలో అస్సాం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.

Published : 29 Nov 2022 02:27 IST

అహ్మదాబాద్‌: రియాన్‌ పరాగ్‌ (174; 116 బంతుల్లో 12×4, 12×6) మెరుపు శతకంతో సత్తాచాటడంతో విజయ్‌ హజారె ట్రోఫీలో అస్సాం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం అస్సాం ఏడు వికెట్ల తేడాతో జమ్ము-కశ్మీర్‌పై విజయం సాధించింది. మొదట జమ్ము-కశ్మీర్‌ 7 వికెట్లకు 350 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది. శుభం ఖజూరియా (120; 84 బంతుల్లో 8×4, 8×6), హెనన్‌ నజీర్‌ (124; 113 బంతుల్లో 5×4, 5×6) సెంచరీలతో అదరగొట్టారు.  అనంతరం అస్సాం 46.1 ఓవర్లలోనే  3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పరాగ్‌తో పాటు రిషవ్‌ దాస్‌ (114 నాటౌట్‌; 118 బంతుల్లో 11×4, 1×6) అజేయ సెంచరీతో మెరిశాడు. మరో క్వార్టర్స్‌ కర్ణాటక 4 వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. మొదట పంజాబ్‌ 235 పరుగులకు ఆలౌటైంది. అభిషేక్‌ శర్మ (109) సెంచరీ సాధించాడు. కర్ణాటక బౌలర్లలో కావేరప్ప (4/40) సత్తా చాటాడు. అనంతరం సమర్థ్‌ (71), శ్రేయస్‌ గోపాల్‌ (42), మనీష్‌ పాండే (35) రాణించడంతో కర్ణాటక 49.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇంకో క్వార్టర్స్‌లో సౌరాష్ట్ర 44 పరుగుల తేడాతో తమిళనాడుపై నెగ్గింది. మొదట హార్విక్‌ దేశాయ్‌ (61), చిరాగ్‌ జాని (52), అర్పిత్‌ (51) రాణించడంతో సౌరాష్ట్ర 8 వికెట్లకు 293 పరుగులు చేసింది. చిరాగ్‌ జాని (3/53), ధర్మేంద్ర జడేజా (2/48), పార్థ్‌ భట్‌ (2/47)ల ధాటికి తమిళనాడు 48 ఓవర్లలో 249 పరుగులకే ఆలౌటైంది. బాబా ఇంద్రజిత్‌ (53), సాయికిశోర్‌ (74) మినహా బ్యాటర్లు విఫలమయ్యారు. బుధవారం సెమీస్‌లో కర్ణాటకతో సౌరాష్ట్ర, అస్సాంతో మహారాష్ట్ర తలపడతాయి.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు