జర్మనీ 1.. స్పెయిన్‌ 1

నాలుగుసార్లు ఛాంపియన్‌ జర్మనీకి ఈసారి ఫిఫా ప్రపంచకప్‌లో నాకౌట్‌ చేరడం కష్టంగా మారింది.

Published : 29 Nov 2022 02:29 IST

అల్‌ ఖోర్‌ (ఖతార్‌): నాలుగుసార్లు ఛాంపియన్‌ జర్మనీకి ఈసారి ఫిఫా ప్రపంచకప్‌లో నాకౌట్‌ చేరడం కష్టంగా మారింది. తొలి మ్యాచ్‌లో జపాన్‌ చేతిలో కంగుతున్న ఆ జట్టు.. బలమైన స్పెయిన్‌తో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. సబ్‌స్టిట్యూట్‌ నిక్లాస్‌ 83వ నిమిషంలో గోల్‌ కొట్టడంతో గ్రూప్‌-ఈలో స్పెయిన్‌తో మ్యాచ్‌ను జర్మనీ 1-1తో డ్రా చేయగలిగింది. స్పెయిన్‌ తరఫున అల్వారో మొరాటా (62వ) గోల్‌ కొట్టాడు. ఆదివారం కోస్టారికాతో మ్యాచ్‌లో జర్మనీ భవితవ్యం తేలుతుంది. గత మ్యాచ్‌లో జపాన్‌ 2-1తో ఆ జట్టుకు షాకిచ్చిన సంగతి తెలిసిందే.

చివరి మ్యాచ్‌లో జర్మనీకి కేవలం నెగ్గితేనే సరిపోదు. ఇతర ఫలితాలు ఆ జట్టుకు అనుకూలంగా రావాలి. తమ తమ చివరి మ్యాచ్‌లో స్పెయిన్‌, జర్మనీలు గెలిస్తే రెండు జట్లూ ముందంజ వేస్తాయి. జపాన్‌-స్పెయిన్‌ మ్యాచ్‌ డ్రా అయితే గోల్‌ అంతరంలో జపాన్‌ కన్నా మెరుగ్గా ఉంటేనే జర్మనీ నాకౌట్లో ప్రవేశించగలుగుతుంది. 1988 ఐరోపా ఛాంపియన్‌షిప్‌ తర్వాతి నుంచి ఇప్పటివరకు ఒక్క అధికారిక మ్యాచ్‌లోనూ స్పెయిన్‌ను జర్మనీ ఓడించలేదు. 2014 ప్రపంచకప్‌ గెలిచిన జర్మనీ.. ఆ తర్వాత ఆడిన అయిదు ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో ఒక్కటి మాత్రమే నెగ్గింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని