49 శాతం మంది క్రికెటర్లు లీగ్‌ల వైపే

దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడడం కంటే టీ20ల్లో లీగ్‌ల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపే క్రికెటర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

Published : 30 Nov 2022 02:41 IST

దిల్లీ: దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడడం కంటే టీ20ల్లో లీగ్‌ల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపే క్రికెటర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. లీగ్‌ల్లో ఆడడం కోసం తమ దేశ బోర్డులతో ఒప్పందాలను వదులుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా 49 శాతం ఆటగాళ్లు మొగ్గు చూపుతున్నట్లుగా అంతర్జాతీయ క్రికెటర్ల సంఘాల సమాఖ్య (ఫికా) జరిపిన ఒక సర్వేలో తేలడం గమనార్హం. తమ వార్షిక నివేదికలో  ఫికా ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే భారత క్రికెటర్లకు ప్రత్యేకంగా సంఘం లేకపోవడం, ఫికా పరిధిలో వారు లేకపోవడం వల్ల వారిని ఈ సర్వే కోసం పరిగణనలోకి తీసుకోలేదు. మిగతా దేశాల క్రికెటర్లలో మాత్రం 49 శాతం మంది ఓటు లీగ్‌లకే అని తేలింది. ఐసీసీ టోర్నీల్లో వన్డే ప్రపంచకప్‌ అత్యుత్తమైందిగా భావిస్తున్నామని 54 శాతం మంది చెప్పడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని