హంపి, హారిక శుభారంభం

టాటా స్టీల్‌ చెస్‌ టోర్నమెంట్లో తొలిసారి నిర్వహిస్తున్న మహిళల ఈవెంట్లో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక శుభారంభం చేశారు.

Published : 30 Nov 2022 02:41 IST

కోల్‌కతా: టాటా స్టీల్‌ చెస్‌ టోర్నమెంట్లో తొలిసారి నిర్వహిస్తున్న మహిళల ఈవెంట్లో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక శుభారంభం చేశారు. మహిళల ర్యాపిడ్‌ విభాగంలో వీళ్లిద్దరూ ఒక్కో గేమ్‌ గెలిచి రెండు గేమ్‌లను డ్రా చేసుకున్నారు. ముగ్గురు ఉక్రెయిన్‌ అమ్మాయిలతో ఆడిన హంపి తొలి గేమ్‌లో అనా ముజ్‌చుక్‌పై నెగ్గి ఆ తర్వాత ఉష్‌నినా, మరియా ముజ్‌చుక్‌తో డ్రా చేసుకుంది. మరోవైపు వైశాలితో పాయింట్లు పంచుకున్న హారిక.. ఆపై ఒలివా (పోలెండ్‌)పై గెలిచి ఉన్‌నినా (ఉక్రెయిన్‌)తో డ్రా చేసుకుంది. హంపి, హారిక రెండేసి పాయింట్లతో వరుసగా రెండు, అయిదో స్థానాల్లో ఉన్నారు. పురుషుల్లో నొడిర్‌బెక్‌ (ఉజ్బెకిస్థాన్‌)పై నెగ్గిన అర్జున్‌ ఇరిగేశి.. విదిత్‌ గుజరాతి, గుకేశ్‌తో డ్రా చేసుకుని 2 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని