ఉమ్రాన్‌ వేగం వల్ల..

ఉమ్రాన్‌ మాలిక్‌ వేగం తనకు ఉపయోగపడుతోందని, తాను తక్కువ వేగంతో బ్యాటర్లను బోల్తా కొట్టించగలుగుతున్నానని భారత ఫాస్ట్‌బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ అన్నాడు.

Published : 30 Nov 2022 02:41 IST

క్రైస్ట్‌చర్చ్‌: ఉమ్రాన్‌ మాలిక్‌ వేగం తనకు ఉపయోగపడుతోందని, తాను తక్కువ వేగంతో బ్యాటర్లను బోల్తా కొట్టించగలుగుతున్నానని భారత ఫాస్ట్‌బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ అన్నాడు. నిలకడగా 145 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్‌ చేసే ఉమ్రాన్‌.. ప్రపంచ ఫాస్టెస్ట్‌ బౌలర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అర్ష్‌దీపేమో స్వింగ్‌ బౌలర్‌. సాధారణంగా 130 కిలోమీటర్ల వేగంతో బంతులేస్తుంటాడు. ‘‘ఉమ్రాన్‌తో కలిసి బౌలింగ్‌ చేస్తుంటే బాగుంటుంది. అతడు చాలా సరదాగా ఉంటాడు. ఇక బౌలింగ్‌ విషయానికొస్తే.. అతడి వేగం వల్ల నాకు చాలా ప్రయోజనం కలుగుతోంది. బ్యాటర్లకు భిన్న వేగాలకు సర్దుకుపోవడం కష్టంగా మారడమే అందుకు కారణం. పేస్‌లో మార్పుల వల్ల వాళ్లు బోల్తాకొడతారు. మేం కలిసి బౌలింగ్‌ చేయడాన్ని ఆస్వాదిస్తున్నాం. సుదీర్ఘకాలం మేం కలిసి బౌలింగ్‌ చేయగలుగుతామని ఆశిస్తున్నా’’ అని అర్ష్‌దీప్‌ చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని