ఫ్రాంఛైజీ కనీస ధర రూ.400 కోట్లు!

కొన్నేళ్ల కలను నిజం చేస్తూ వచ్చే సీజన్‌ నుంచే మహిళల ఐపీఎల్‌ను మొదలుపెట్టడానికి నిర్ణయించిన బీసీసీఐ.. అందులో ఫ్రాంఛైజీని దక్కించుకోవడానికి కనీస ధరను దాదాపు రూ.400 కోట్లుగా నిర్ణయించినట్లు సమాచారం.

Updated : 30 Nov 2022 06:36 IST

మహిళల ఐపీఎల్‌ కోసం బీసీసీఐ నిర్ణయం

ముంబయి: కొన్నేళ్ల కలను నిజం చేస్తూ వచ్చే సీజన్‌ నుంచే మహిళల ఐపీఎల్‌ను మొదలుపెట్టడానికి నిర్ణయించిన బీసీసీఐ.. అందులో ఫ్రాంఛైజీని దక్కించుకోవడానికి కనీస ధరను దాదాపు రూ.400 కోట్లుగా నిర్ణయించినట్లు సమాచారం. అయిదు జట్లతో 2023లో తొలి సీజన్‌ నిర్వహించడానికి బీసీసీఐ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. త్వరలో బిడ్డింగ్‌ ప్రక్రియ మొదలు కానుండగా.. ప్రతి ఫ్రాంఛైజీ ధర కనీసం వెయ్యి కోట్లు దాటుతుందని బోర్డు అంచనా వేస్తోంది. 2008లో పురుషుల ఐపీఎల్‌ ఆరంభానికి ముందు నిర్వహించిన బిడ్డింగ్‌ ప్రక్రియలో ముంబయి ఇండియన్స్‌ గరిష్టంగా 111.9 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.446 కోట్లు) ధర పలికింది. బహిరంగ పరచని బిడ్‌ల ద్వారా మహిళల ఐపీఎల్‌ టెండర్‌ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. పురుషుల ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు కూడా బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చు. ఫ్రాంఛైజీని కొన్న ధరను అయిదేళ్ల కాలంలో అయిదు సమాన వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. మహిళల ఐపీఎల్‌ తొలి సీజన్‌ 2023 మార్చిలో జరుగుతుంది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని