భారత్‌ గెలిచింది

ప్రపంచ నంబర్‌వన్‌ ఆస్ట్రేలియాకు భారత్‌ హాకీ జట్టు వాళ్ల సొంతగడ్డపై స్ట్రోక్‌ ఇచ్చింది. 5 టెస్టుల పోరులో భాగంగా బుధవారం మూడో మ్యాచ్‌లో 4-3 కంగారూ జట్టును ఓడించి సిరీస్‌ను 1-2తో సజీవంగా ఉంచుకుంది.

Published : 01 Dec 2022 04:31 IST

ఆస్ట్రేలియాను ఓడించిన హర్మన్‌ సేన

అడిలైడ్‌: ప్రపంచ నంబర్‌వన్‌ ఆస్ట్రేలియాకు భారత్‌ హాకీ జట్టు వాళ్ల సొంతగడ్డపై స్ట్రోక్‌ ఇచ్చింది. 5 టెస్టుల పోరులో భాగంగా బుధవారం మూడో మ్యాచ్‌లో 4-3 కంగారూ జట్టును ఓడించి సిరీస్‌ను 1-2తో సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (12వ ని) చేసిన గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లిన భారత్‌.. ఆపై వెనుకబడింది. జాక్‌ (25వ), అరాన్‌ (32వ) గోల్స్‌ చేసి ఆసీస్‌ను ఆధిక్యంలో నిలిపారు. కానీ మన జట్టు బలంగా పుంజుకుంది. 10 నిమిషాల తేడాతో అభిషేక్‌ (47వ), షంషేర్‌ (57వ) బంతిని నెట్‌లోకి పంపడంతో స్కోరు 3-2గా మారింది. అయితే భారత్‌ ఆనందం కాసేపే. కంగారూ ఆటగాడు నాథన్‌ (59వ) గోల్‌ చేసి స్కోరు సమం చేశాడు. మ్యాచ్‌ డ్రాగా ముగియడం ఖాయం అనుకున్న తరుణంలో ఆకాశ్‌దీప్‌ (60వ) మెరుపు గోల్‌తో భారత్‌ను గెలిపించాడు. ఈ సిరీస్‌లో తొలి టెస్టులో 4-5తో ఓడిన హర్మన్‌ప్రీత్‌ బృందం.. రెండో టెస్టులో 4-7తో తలొంచింది. గత ఆరేళ్లలో నిర్ణీత సమయంలోపు ఆస్ట్రేలియాపై గెలవడం మనకు ఇదే తొలిసారి. చివరిగా 2016లో 2 టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్టులో భారత్‌ 3-2తో కంగారూలను ఓడించింది. ఆ తర్వాత 13 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా 10 మ్యాచ్‌లను నిర్ణీత సమయంలో గెలిచింది. ఒకటి పెనాల్టీ షూటౌట్లో దక్కించుకుంది. భారత్‌ సాధించిన ఏకైక విజయం పెనాల్టీ షూటౌట్‌ ద్వారా లభించింది. ఒక మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు