గోల్‌ కొట్టి.. ఆసుపత్రికి

ఫిఫా ప్రపంచకప్‌లో ఇరాన్‌కు మరోసారి నిరాశ తప్పలేదు. తొలిసారి నాకౌట్‌ చేరాలనుకున్న ఆ జట్టు ఆశలను అమెరికా కూల్చేసింది. కనీసం డ్రా చేసుకున్నా ముందంజ వేసే ఛాన్స్‌ ఇరాన్‌కు ఉండేది.

Updated : 01 Dec 2022 08:58 IST

అమెరికా 1...ఇరాన్‌ 0

దోహా: ఫిఫా ప్రపంచకప్‌లో ఇరాన్‌కు మరోసారి నిరాశ తప్పలేదు. తొలిసారి నాకౌట్‌ చేరాలనుకున్న ఆ జట్టు ఆశలను అమెరికా కూల్చేసింది. కనీసం డ్రా చేసుకున్నా ముందంజ వేసే ఛాన్స్‌ ఇరాన్‌కు ఉండేది. కానీ మంగళవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 0-1తో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. క్రిస్టియన్‌ పులిసిచ్‌ (38వ నిమిషంలో) అమెరికాను ప్రిక్వార్టర్స్‌కు చేర్చి ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడి నుంచే వర్చువల్‌గా సహచరులతో కలిసి సంబరాలు చేసుకున్నాడు. ఆరంభం నుంచే గోల్స్‌ కోసం అమెరికా దాడులు మొదలెట్టింది. కానీ ఇరాన్‌ గోల్‌కీపర్‌ అలీ ఆ జట్టు ప్రయత్నాలను సమర్థంగా అడ్డుకున్నాడు. పదో నిమిషంలో పులిసిచ్‌ హెడర్‌ను అతను ఆపాడు. గోల్‌ కోసం టిమ్‌ వియా చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. పులిసిచ్‌ ఆ జట్టులో ఆనందాన్ని నింపాడు. గోల్‌పోస్టు వైపు దూసుకెళ్తూ సెర్గియో నుంచి పాస్‌ అందుకున్న అతను.. బంతిని లోపలికి పంపించాడు. కానీ తన వేగాన్ని నియంత్రించుకోలేక గోల్‌కీపర్‌ను బలంగా ఢీకొట్టి గాయపడ్డాడు. వెంటనే అతణ్ని ఆసుపత్రికి తరలించారు. మ్యాచ్‌లో స్కోరు సమం చేసేందుకు ఇరాన్‌ బలంగా ప్రయత్నించింది కానీ ఫలితం రాబట్టలేకపోయింది. అమెరికా ప్రిక్వార్టర్స్‌లో నెదర్లాండ్స్‌తో ఆ జట్టు తలపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు