గోల్‌ కాదని తేల్చిన బంతి

ఉరుగ్వేతో మ్యాచ్‌లో తొలి గోల్‌ నమోదు కాగానే పోర్చుగల్‌ స్టార్‌ రొనాల్డో సంబరాల్లో మునిగిపోయాడు. గోల్‌ తనే చేశాననుకున్నాడు.

Published : 01 Dec 2022 04:08 IST

దోహా: ఉరుగ్వేతో మ్యాచ్‌లో తొలి గోల్‌ నమోదు కాగానే పోర్చుగల్‌ స్టార్‌ రొనాల్డో సంబరాల్లో మునిగిపోయాడు. గోల్‌ తనే చేశాననుకున్నాడు. కానీ చివరకు చూస్తే ఫెర్నాండెజ్‌ ఖాతాలో ఆ గోల్‌ చేరింది. కార్నర్‌ నుంచి ఫెర్నాండెజ్‌ తన్నిన బంతి గాల్లో గోల్‌పోస్టు వైపు దూసుకెళ్లింది. మధ్యలో రొనాల్డో ఎగిరి తలతో బంతిని నెట్‌లోకి పంపే ప్రయత్నం చేశాడు. అది నేరుగా వెళ్లి లోపల పడడంతో రొనాల్డోదే గోల్‌ అని అంతా అనుకున్నారు. కానీ బంతికి అతని తల కొంచెం కూడా తాకలేదని తేలింది. ఈ విషయాన్ని తేల్చింది మ్యాచ్‌లో ఉపయోగించిన బంతే. ఈ ప్రపంచకప్‌ కోసం ‘‘కనెక్టెడ్‌ బాల్‌ టెక్నాలజీ’’ అనే సాంకేతికతను వాడుతున్నారు. అధికారిక మ్యాచ్‌ బంతి ‘‘అల్‌ రిహ్లా’’లో 500 హెర్ట్జ్‌ఇనర్షల్‌ మెజర్‌మెంట్‌ యూనిట్‌ (ఐఎంయూ) అనే సెన్సార్‌ను పెట్టారు. ఇది ఎవరైనా బంతిని తాకినప్పుడు హృదయ స్పందన రూపంలో సంకేతాలిస్తోంది. రొనాల్డో తల పక్క నుంచి బంతి వెళ్లినప్పుడు ఇలాంటి సంకేతాలు ఏమీ రాలేదు. క్రికెట్లో బ్యాట్‌ను బంతి తాకిందో లేదోనని తెలుసుకునేందుకు వాడే స్నికోమీటర్‌ సాంకేతిక లాంటిదే ఇది కూడా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని