పిస్టల్‌ రాణి.. మను

భారత యువ షూటింగ్‌ సంచలనం మను బాకర్‌ జాతీయ ఛాంపియన్‌షిప్స్‌లో సత్తాచాటింది. మహిళల 25మీ. పిస్టల్‌ విభాగాల్లో నాలుగింటికి నాలుగు స్వర్ణాలు ఖాతాలో వేసుకుంది.

Published : 02 Dec 2022 02:52 IST

జాతీయ ఛాంపియన్‌షిప్‌లో క్లీన్‌స్వీప్‌

దిల్లీ: భారత యువ షూటింగ్‌ సంచలనం మను బాకర్‌ జాతీయ ఛాంపియన్‌షిప్స్‌లో సత్తాచాటింది. మహిళల 25మీ. పిస్టల్‌ విభాగాల్లో నాలుగింటికి నాలుగు స్వర్ణాలు ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే జూనియర్‌, సీనియర్‌ మహిళల టీమ్‌ విభాగాల్లో రెండు బంగారు పతకాలు గెలిచిన ఆమె.. గురువారం వ్యక్తిగత విభాగాల్లోనూ ఛాంపియన్‌గా నిలిచింది. సీనియర్‌ పసిడి పోరులో ఈ హరియాణా అమ్మాయి 33-27 తేడాతో పుష్పాంజలి (సీఆర్‌పీఎఫ్‌)పై గెలిచింది. విభూతి (హరియాణా) కాంస్యం సొంతం చేసుకుంది. జూనియర్‌ స్వర్ణ పతక రౌండ్లో మను 32-24తో విభూతిపై గెలిచింది. మరోవైపు కేరళలో జరుగుతున్న రైఫిల్‌ జాతీయ పోటీల 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌లో సమీక్ష- అర్జున్‌ (పంజాబ్‌) బంగారు పతకం నెగ్గారు. ఫైనల్లో ఈ జోడీ 17-5తో శ్రేయ- హర్షిత్‌ (మధ్యప్రదేశ్‌)పై పైచేయి సాధించింది. జూనియర్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ రైఫిల్‌లో నాన్సీ- గుర్ముఖ్‌ (హరియాణా) ద్వయం 16-10తో తిలోత్తమ- డారియస్‌ (కర్ణాటక)పై గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని