మారడోనాతో తండ్రి.. మెస్సీతో తనయుడు

కార్లోస్‌ మ్యాక్‌ అలిస్టర్‌.. అర్జెంటీనా మాజీ ఆటగాడు. దిగ్గజం డీగో మారడోనాతో కలిసి ఆడాడు. అలెక్సిస్‌ మ్యాక్‌ అలిస్టర్‌.. ఆల్‌టైమ్‌ దిగ్గజ ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగిన మెస్సీతో కలిసి ఆడుతున్నాడు.

Published : 02 Dec 2022 02:52 IST

కార్లోస్‌ మ్యాక్‌ అలిస్టర్‌.. అర్జెంటీనా మాజీ ఆటగాడు. దిగ్గజం డీగో మారడోనాతో కలిసి ఆడాడు. అలెక్సిస్‌ మ్యాక్‌ అలిస్టర్‌.. ఆల్‌టైమ్‌ దిగ్గజ ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగిన మెస్సీతో కలిసి ఆడుతున్నాడు. ఆ కార్లోస్‌ ఎవరో కాదు.. అలెక్సిస్‌ తండ్రి. నాన్న అప్పుడు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించగా.. ఇప్పుడా వారసత్వాన్ని నిలబెడుతూ కొడుకు అదరగొడుతున్నాడు. పోలండ్‌తో పోరులో తొలి గోల్‌ కొట్టి అర్జెంటీనా నాకౌట్‌ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. 23 ఏళ్ల అతనికిదే మొదటి అంతర్జాతీయ గోల్‌. అతని సంతోషంతో అక్కడితోనే ఆగిపోలేదు. మ్యాచ్‌ ముగిశాక తనకు దక్కిన ‘‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’’ అవార్డును మెస్సి.. అలెక్సిస్‌కు అందించాడు. ఆరాధ్య ఆటగాడి నుంచి ఆ గుర్తింపు దక్కడంతో అతను ఆనందంలో మునిగిపోయాడు. మారడోనాతో నాన్న ఆడాడని, మెస్సీతో తాను ఆడుతుండడం ఎప్పటికీ మర్చిపోలేనని అన్నాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు