బెల్జియం ఔట్
ఓ అగ్ర జట్టు కథ ముగిసింది. గత ప్రపంచకప్‌లో మూడో స్థానంలో నిలిచిన ప్రపంచ నంబర్-2 బెల్జియం ఈసారి గ్రూప్ దశనే దాటలేకపోయింది.
క్రొయేషియాతో మ్యాచ్ 0-0తో డ్రా
ఓ అగ్ర జట్టు కథ ముగిసింది. గత ప్రపంచకప్‌లో మూడో స్థానంలో నిలిచిన ప్రపంచ నంబర్-2 బెల్జియం ఈసారి గ్రూప్ దశనే దాటలేకపోయింది. ముందంజ వేయాలంటే తప్పక నెగ్గాల్సిన తన చివరి మ్యాచ్‌లో క్రొయేషియాతో 0-0 డ్రా చేసుకున్న ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. లుకాకు మంచి అవకాశాలను చేజార్చడం బెల్జియంను దెబ్బతీసింది. గ్రూప్-ఎఫ్ నుంచి రెండో స్థానంతో క్రొయేషియా నాకౌట్లో ప్రవేశించింది. కెనడాపై గెలిచిన మొరాకో ఈ గ్రూపులో అగ్రస్థానంతో ముందుకెళ్లింది.
గత టోర్నీ రన్నరప్ క్రొయేషియా ప్రపంచకప్ నాకౌట్‌కు దూసుకెళ్లింది. గురువారం బెల్జియంతో మ్యాచ్‌ను గోల్ లేని డ్రాగా ముగించిన ఆ జట్టు అయిదు పాయింట్లతో గ్రూప్-ఎఫ్ లో రెండో స్థానంలో నిలిచింది. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడంలో విఫలమైన బెల్జియం నాలుగు పాయింట్లతో నిష్క్రమించింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన కెనడా గ్రూపులో అట్టడుగు స్థానంతో టోర్నీని వీడింది. మొరాకో ఏడు పాయింట్లతో గ్రూపులో మొదటి స్థానం సాధించింది.
బెల్జియంకు అవకాశాలు వచ్చినా..: క్రొయేషియాకు డ్రా చేసుకున్నా ముందంజ వేసే అవకాశమున్న నేపథ్యంలో మ్యాచ్‌లో ఎక్కువ ఒత్తిడి బెల్జియంపైనే. రెండు జట్లు దాదాపు సమానంగా బంతిని నియంత్రించాయి. మ్యాచ్ మొదలైన పది సెకన్లలో క్రొయేషియా గోల్ కొట్టినంత పని చేసింది. అయితే పెరిసిచ్ కుడి కాలితో ఆడిన షాట్ కుడి పోస్ట్‌కు కాస్త దూరం నుంచి వెళ్లింది. పదో నిమిషంలో బెల్జియం ఆటగాడు కరాస్కో ప్రయత్నాన్ని క్రొయేషియా రక్షణ శ్రేణి అడ్డుకుంది. కాసేపట్లోనే బెల్జియంకు షాక్. క్రొయేషియా ఆధిక్యం సాధించినట్లేనని అనుకున్నారంతా. బెల్జియం బాక్స్‌లో క్రమరిచ్ను కరాస్కో పడేయడంతో క్రొయేషియాకు రిఫరీ పెనాల్టీ ఇచ్చాడు. కానీ అది ఆఫ్‌సైడ్ అని వీఏఆర్ (వీడియో అసిస్టెంట్ రిఫరీ)లో తేలడంతో క్రొయేషియాకు పెనాల్టీ దక్కలేదు. అయితే ప్రథమార్థం చివర్లో ఆ జట్టే ఎక్కువ దూకుడు ప్రదర్శించింది. ప్రమాదకరంగా కనిపించింది. బెల్జియం నెమ్మదించింది. 45వ నిమిషంలో క్రమరిచ్ షాట్ బెల్జియం ఎడమ పోస్ట్ నుంచి దూరంగా వెళ్లింది. ద్వితీయార్ధం ఆరంభంలో బెల్జియం మంచి అవకాశం సృష్టించుకుంది. కానీ ఫలితం లేకపోయింది. కుడి వైపు నుంచి డిబ్రుయిన్ క్రాస్ ఇవ్వగా.. లుకాకు దాన్ని తలతో నేరుగా క్రొయేషియా గోల్‌కీపర్ చేతుల్లోకి కొట్టాడు. 61వ నిమిషంలో లుకాకు ఓ సువర్ణావకాశాన్ని వృథా చేశాడు. డిబ్రుయిన్ క్రొయేషియా మిడ్ఫీల్డ్లోని ఖాళీల్లో నుంచి కరాస్కోకు బంతినివ్వగా.. అతడు క్రొయేషియా ఆటగాళ్లను తప్పించుకుంటూ వెళ్లి ఆడిన షాట్‌ను జురనోవిచ్ గొప్పగా అడ్డుకున్నాడు. రీబౌండ్ లుకాకుకు చక్కగా దొరికింది. అలవోకగా గోల్ కొట్టే అవకాశమది. కానీ లుకాకు కుడి కాలితో ఆడిన షాట్ పోస్టుకు తగిలింది. గోల్ కోసం ప్రయత్నాలు కొనసాగించిన బెల్జియం చివరి అయిదు నిమిషాల్లో, ఇంజురీ సమయంలో మంచి అవకాశాలు సృష్టించుకున్నా ఫలితం లేపోయింది. లుకాకు అవకాశాలను వృథా చేశాడు. 87వ నిమిషంలో కేవలం 4 గజాల దూరం నుంచి అతడు గోల్ కొట్టలేపోయాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS: లంచ్ బ్రేక్.. అర్ధశతకం దిశగా లబుషేన్.. ఆసీస్ స్కోరు 76/2 (32)
-
World News
Biden: జిన్‌పింగ్‌కు పరిమితులు తెలుసు..: బైడెన్
-
World News
Earthquake: చేజారిన ఆ 72 గంటలు.. తుర్కియే, సిరియాల్లో భారీగా పెరగనున్న మృతులు..!
-
Movies News
Prakash Raj: ‘కశ్మీర్ ఫైల్స్’పై ప్రకాశ్‌రాజ్ తీవ్ర వ్యాఖ్యలు
-
World News
Earthquake: అంతులేని విషాదం.. భూప్రళయంలో 15వేలు దాటిన మరణాలు..!
-
Crime News
Kakinada: కాకినాడ జిల్లాలో విషాదం.. ఆయిల్ ట్యాంకర్లో దిగి ఏడుగురి మృతి