ముందుకెవరో?.. నేటి నుంచే నాకౌట్‌ సమరం

గ్రూప్‌ దశలో మాదిరి ఈసారి షాక్‌ తగిలితే పుంజుకోవడానికి ఇంకో అవకాశం లేదక్కిడ. ఏ జట్టూ ఆషామాషీగా నాకౌట్‌ చేరింది కాదు కాబట్టి తేలిగ్గా తీసుకుంటే అంతే సంగతులు.

Updated : 03 Dec 2022 23:55 IST

దోహా: గ్రూప్‌ దశలో మాదిరి ఈసారి షాక్‌ తగిలితే పుంజుకోవడానికి ఇంకో అవకాశం లేదక్కిడ. ఏ జట్టూ ఆషామాషీగా నాకౌట్‌ చేరింది కాదు కాబట్టి తేలిగ్గా తీసుకుంటే అంతే సంగతులు. పెద్ద జట్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తేనే ముందుకు వెళ్లేది. లేకుంటే నిష్క్రమణ తప్పదు. నాకౌట్‌ దశలో తొలి రోజు పరీక్ష ఎదుర్కోబోయేది అర్జెంటీనా, నెదర్లాండ్స్‌. శనివారం ప్రిక్వార్టర్స్‌లో మెస్సిసేన ఆస్ట్రేలియాను, డచ్‌ జట్టు అమెరికాను ఢీకొనబోతున్నాయి. గ్రూప్‌ దశ తొలి మ్యాచ్‌లో సౌదీ చేతిలో తిన్న షాక్‌ను అర్జెంటీనా ఇంకా మరిచిపోయి ఉండదు. ఆ ఫలితంతో నాకౌట్‌ బెర్తు ప్రమాదంలో పడ్డ స్థితిలో తీవ్ర ఒత్తిడి మధ్య ఈ మాజీ ఛాంపియన్‌ మెక్సికో, పోలెండ్‌లపై గెలిచి గ్రూప్‌ దశ నిష్క్రమణ ప్రమాదాన్ని తప్పించుకుంది. పోరాటానికి మారుపేరైన ఆస్ట్రేలియా.. 16 ఏళ్ల తర్వాత నాకౌట్‌ చేరిన ఊపులో ఉంది. మరి అర్జెంటీనా ఆ జట్టుపై ఎంత అప్రమత్తంగా ఆడి గెలుస్తుందో చూడాలి. మరోవైపు మూడుసార్లు రన్నరప్‌ నెదర్లాండ్స్‌ గ్రూప్‌ దశలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. సులువుగానే క్వార్టర్స్‌ చేరినప్పటికీ.. చిన్న జట్ల పైనా దూకుడుగా ఆడలేకపోయింది. గ్రూప్‌ దశలో చక్కటి ప్రదర్శన చేసిన అమెరికాను ఓడించాలంటే డచ్‌ జట్టు పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించాల్సిందే.


ప్రపంచకప్‌లో ఈనాడు

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని