నెయ్‌మార్‌ వచ్చాడు..

ప్రపంచకప్‌లో స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌లో కుడి చీలమండ గాయంతో జట్టుకు దూరమైన నెయ్‌మార్‌.. కామెరూన్‌తో పోరుకు మైదానంలోకి వచ్చాడు.

Published : 04 Dec 2022 03:10 IST

ప్రపంచకప్‌లో స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌లో కుడి చీలమండ గాయంతో జట్టుకు దూరమైన నెయ్‌మార్‌.. కామెరూన్‌తో పోరుకు మైదానంలోకి వచ్చాడు. మ్యాచ్‌కు ముందు సహచరులు సాధన చేస్తుంటే అతనూ బంతితో ఆడాడు. అనంతరం జట్టు డగౌట్‌ వెనకాల స్టాండ్స్‌లో కూర్చుని మ్యాచ్‌ వీక్షించాడు. ఆ గాయం కారణంగా గ్రూప్‌ దశ మ్యాచ్‌లకు దూరమైన అతను త్వరలోనే తిరిగి మైదానంలో పరుగులు పెట్టే అవకాశముంది. మరోవైపు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన దిగ్గజం పీలేకు మద్దతుగా బ్రెజిల్‌ అభిమానులు బ్యానర్లు ప్రదర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు