గెలుపు బాటలో హైదరాబాద్‌

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ తొమ్మిదో సీజన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హైదరాబాద్‌ ఎఫ్‌సీ తిరిగి గెలుపు బాట పట్టింది.

Published : 04 Dec 2022 03:10 IST

చెన్నై: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ తొమ్మిదో సీజన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హైదరాబాద్‌ ఎఫ్‌సీ తిరిగి గెలుపు బాట పట్టింది. గత రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఆ జట్టు.. శనివారం పోరులో 3-1 తేడాతో చెన్నయిన్‌ ఎఫ్‌సీని చిత్తుచేసింది. హలి చరణ్‌ (65వ నిమిషంలో), చింగ్లెన్‌సన (74వ), హెరెరా (85వ) తలో గోల్‌ కొట్టారు. చెన్నయిన్‌ జట్టులో నమోదైన ఏకైక గోల్‌ను స్లిస్కోవిచ్‌ (78వ) చేశాడు. ఈ విజయంతో హైదరాబాద్‌ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. మరో మ్యాచ్‌లో ఏటీకే మోహన్‌ బగాన్‌ 1-0తో బెంగళూరు ఎఫ్‌సీపై విజయం సాధించింది. పెట్రాటోస్‌ (66వ) గెలుపు గోల్‌ కొట్టాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు