రావల్పిండిలో పరుగుల పండగ

రావల్పిండి: 7.. ఇప్పటిదాకా ఇంగ్లాండ్‌-పాకిస్థాన్‌ తొలి టెస్టులో నమోదైన సెంచరీలు! జీవమే లేని పిచ్‌పై పరుగుల వరద పారిస్తూ తొలి ఇన్నింగ్స్‌లో నలుగురు ఇంగ్లిష్‌ బ్యాటర్లు శతకాలు చేయగా..

Published : 04 Dec 2022 03:10 IST

ముగ్గురు బ్యాటర్ల శతకాలు
పాక్‌ 499/7

రావల్పిండి: 7.. ఇప్పటిదాకా ఇంగ్లాండ్‌-పాకిస్థాన్‌ తొలి టెస్టులో నమోదైన సెంచరీలు! జీవమే లేని పిచ్‌పై పరుగుల వరద పారిస్తూ తొలి ఇన్నింగ్స్‌లో నలుగురు ఇంగ్లిష్‌ బ్యాటర్లు శతకాలు చేయగా.. తామేం తక్కువా అన్నట్లు ముగ్గురు పాక్‌ ఆటగాళ్లు మూడంకెల స్కోరు అందుకున్నారు. ఇంగ్లాండ్‌ భారీ స్కోరు 657కు జవాబుగా మూడోరోజు, శనివారం ఆట ముగిసేసరికి తొలి ఇన్నింగ్స్‌లో పాక్‌ 7 వికెట్లకు 499 పరుగులు చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 181/0తో ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాక్‌ను షఫీఖ్‌ (114; 203 బంతుల్లో 13×4, 3×6), ఇమాముల్‌ హక్‌ (121; 207 బంతుల్లో 15×4, 2×6) సెంచరీలతో ముందుకు తీసుకెళ్లారు. వీళ్లిద్దరూ వెనుదిరిగాక బాబర్‌ అజామ్‌ (136; 168 బంతుల్లో 19×4, 1×6) బాధ్యత తీసుకున్నాడు. శతకం చేసిన అతడు అజహర్‌ అలీ (27), షకీల్‌ (37), రిజ్వాన్‌ (29)తో కలిసి స్కోరును 450 పరుగులు దాటించాడు. 413/3తో మెరుగైన స్థితిలో ఉన్న పాక్‌ 86 పరుగుల తేడాతో 4 వికెట్లు చేజార్చుకుంది. ఆట చివరికి సల్మాన్‌ (15), జహీద్‌ (1) క్రీజులో ఉన్నారు. పాక్‌ ఇంకా 158 పరుగులు వెనుకబడి ఉంది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో జాక్స్‌ 3, లీచ్‌ 2 వికెట్లు తీశారు.

గుండుపై బంతి రుద్ది!

బంతికి మెరుపు తెప్పించాలంటే ఇది వరకు లాలాజలాన్ని ఉపయోగించేవాళ్లు. ఇప్పుడు దానిపై నిషేధం ఉండడంతో చెమటను వాడుతున్నారు. కానీ పాక్‌తో తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ రూట్‌ సరదాగా ఓ ప్రయోగం చేశాడు. రాబిన్సన్‌ బౌలింగ్‌ చేసే సమయంలో రివర్స్‌ స్వింగ్‌కు బంతి సహకరించేందుకు స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ తలపై టోపీని తీసి నున్నని అతడి గుండుపై బంతి రుద్దాడు. దీంతో వ్యాఖ్యాతగా ఉన్న ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ నాసర్‌ హుస్సేన్‌కు నవ్వాగలేదు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు