పోరాడుతున్న విండీస్‌

ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో 498 పరుగుల భారీ ఛేదనలో వెస్టిండీస్‌ పోరాడుతోంది. కెప్టెన్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (101 బ్యాటింగ్‌; 166 బంతుల్లో 11×4) అజేయ సెంచరీ సాధించడంతో నాలుగోరోజు,

Published : 04 Dec 2022 03:10 IST

బ్రాత్‌వైట్‌ అజేయ సెంచరీ
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు

పెర్త్‌: ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో 498 పరుగుల భారీ ఛేదనలో వెస్టిండీస్‌ పోరాడుతోంది. కెప్టెన్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (101 బ్యాటింగ్‌; 166 బంతుల్లో 11×4) అజేయ సెంచరీ సాధించడంతో నాలుగోరోజు, శనివారం ఆట చివరికి రెండో ఇన్నింగ్స్‌లో 192/3తో నిలిచింది. ఛేదనలో తేజ్‌ నారాయణ్‌ చందర్‌పాల్‌ (45)తో తొలి వికెట్‌కు 116 పరుగులు జోడించి బ్రాత్‌వైట్‌ గట్టి పునాది వేశాడు. ఆపై బ్లాక్‌వుడ్‌ (24) తోడుగా ఇన్నింగ్స్‌ను నడిపించిన అతడు అదే క్రమంలో సెంచరీ చేశాడు. ఆట చివరికి బ్రాత్‌వైట్‌తో పాటు మేయర్స్‌ (0) క్రీజులో ఉన్నాడు. చేతిలో ఇంకా 7 వికెట్లు ఉన్న విండీస్‌ చివరిరోజు 306 పరుగులు సాధించాలి. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 29/1తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆసీస్‌ 182/2 వద్ద డిక్లేర్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ద్విశతకం చేసిన లబుషేన్‌ (104 నాటౌట్‌; 110 బంతుల్లో 13×4, 2×6) ఈసారి సెంచరీతో మెరిశాడు. వార్నర్‌ (48) కూడా రాణించాడు. లబుషేన్‌ శతకం పూర్తయ్యాక ఆసీస్‌ డిక్లేర్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 598/4 వద్ద డిక్లేర్‌ చేయగా.. విండీస్‌ 283కే ఆలౌటైంది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు