అర్జున్‌కు బ్లిట్జ్‌ టైటిల్‌

తెలంగాణ యువ చెస్‌ సంచలనం అర్జున్‌ ఇరిగేశి మరో టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. టాటా స్టీల్‌ చెస్‌ బ్లిట్జ్‌ ఓపెన్‌లో ఆదివారం ఈ గ్రాండ్‌మాస్టర్‌ విజేతగా నిలిచాడు.

Published : 05 Dec 2022 02:43 IST

కోల్‌కతా: తెలంగాణ యువ చెస్‌ సంచలనం అర్జున్‌ ఇరిగేశి మరో టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. టాటా స్టీల్‌ చెస్‌ బ్లిట్జ్‌ ఓపెన్‌లో ఆదివారం ఈ గ్రాండ్‌మాస్టర్‌ విజేతగా నిలిచాడు. మొత్తం 18 రౌండ్లు ముగిసే సరికి 12.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. టోర్నీలో దూకుడు కొనసాగించిన అర్జున్‌ చివరి రౌండ్‌ ఫలితంతో సంబంధం లేకుండా 17 రౌండ్లు పూర్తయ్యే సరికే 12 పాయింట్లతో టైటిల్‌ ఖాయం చేసుకున్నాడు. చివరి రౌండ్లో మరో భారత గ్రాండ్‌మాస్టర్‌ నిహాల్‌ సరీన్‌తో గేమ్‌ డ్రా చేసుకుని తిరుగులేని ఆధిక్యంతో ట్రోఫీ సొంతం చేసుకున్నాడు. 10 విజయాలు, 5 డ్రాలు నమోదు చేసిన అతను.. 3 గేమ్‌ల్లో ఓడాడు. విదిత్‌ (9), ప్రజ్ఞానంద (8.5) నిహాల్‌ (8) వరుసగా 5, 6, 7 స్థానాల్లో నిలిచారు. అంతకుముందు ఈ టోర్నీలో ర్యాపిడ్‌ విభాగంలో అర్జున్‌ రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. బ్లిట్జ్‌ మహిళల్లో వైశాలి (13.5) టైటిల్‌ దక్కించుకుంది. ఆమె 11 విజయాలు, 5 డ్రాలు, రెండు ఓటములు నమోదు చేసింది. హారిక (11) మూడు, హంపి (9.5) అయిదో స్థానాల్లో నిలిచారు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని