263 పరుగులా.. 8 వికెట్లా!
పరుగుల వర్షం కురుస్తున్న ఇంగ్లాండ్-పాకిస్థాన్ తొలి టెస్టులో ఫలితం వచ్చేలా కనిపిస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో ధాటిగా ఆడి త్వరగా డిక్లేర్ చేసిన ఇంగ్లిష్ జట్టు..
రావల్పిండి: పరుగుల వర్షం కురుస్తున్న ఇంగ్లాండ్-పాకిస్థాన్ తొలి టెస్టులో ఫలితం వచ్చేలా కనిపిస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో ధాటిగా ఆడి త్వరగా డిక్లేర్ చేసిన ఇంగ్లిష్ జట్టు.. ప్రత్యర్థి ముందు 343 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నాలుగో రోజు ఆట చివరికి రెండో ఇన్నింగ్స్‌లో పాక్ 80/2తో నిలిచింది. షఫీఖ్ (6), బాబర్ (4) త్వరగా ఔట్ కాగా.. ఇమాముల్ హక్ (43), షకీల్ (24) క్రీజులో ఉన్నారు. పాక్‌కు ఇంకా 263 పరుగులు, ఇంగ్లాండ్‌కు 8 వికెట్లు కావాలి. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 499/7తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాక్ 579 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ స్పిన్నర్ విల్ జాక్స్ (6/161) అరంగేట్రంలో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగుల ఆధిక్యాన్ని సొంతం చేసుకున్న ఇంగ్లాండ్.. రెండో ఇన్నింగ్స్‌లో 7 పైన రన్‌రేట్‌తో ఆడింది. ఒక దశలో 36/2తో ఇబ్బంది పడ్డా.. క్రాలీ (50), రూట్ (73), బ్రూక్ (87) బ్యాట్ ఝుళిపించడంతో స్కోరు పరుగులెత్తింది. టీ విరామానికి ఇంగ్లాండ్ 264/7 వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 657 పరుగులు చేయగా.. పాక్ 579కి ఆలౌటైంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Handsome Man: శాస్త్రీయంగా ప్రపంచంలోనే అందమైన వ్యక్తి ఎవరంటే?
-
India News
Arvind Kejriwal: చర్చలకు పిలిచిన సక్సేనా.. నో చెప్పిన కేజ్రీవాల్
-
Crime News
Crime News: రైలు ఇంజిన్‌కు చిక్కుకున్న మృతదేహం.. జమ్మికుంట స్టేషన్లో కలకలం
-
World News
Ukraine Crisis: యుద్ధట్యాంకుల సాయం ప్రకటన వేళ.. ఉక్రెయిన్‌పై 50కిపైగా క్షిపణి దాడులు
-
Movies News
Haripriya: ఒక్కటైన ‘కేజీయఫ్’ నటుడు, ‘పిల్ల జమీందార్’ నటి
-
Sports News
Ishan Kishan: నా బ్యాట్‌పై అతడి ఆటోగ్రాఫ్.. జీవితంలో మరచిపోలేని సందర్భం: ఇషాన్ కిషన్