సంక్షిప్త వార్తలు(5)
ఆఫ్‌స్పిన్నర్ నాథన్ లైయన్ (6/128) విజృంభించడతో తొలి టెస్టులో ఆస్ట్రేలియా 164 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై ఘనవిజయం సాధించింది.
తొలి టెస్టులో విండీస్‌పై ఆసీస్ ఘనవిజయం
పెర్త్: ఆఫ్‌స్పిన్నర్ నాథన్ లైయన్ (6/128) విజృంభించడతో తొలి టెస్టులో ఆస్ట్రేలియా 164 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై ఘనవిజయం సాధించింది. 498 పరుగుల ఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 192/3తో చివరి రోజు, ఆదివారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన విండీస్.. లైయన్ ధాటికి 333 పరుగులకు ఆలౌటైంది. నాలుగో రోజే శతకం సాధించిన ఓపెనర్ బ్రాత్‌వైట్.. చివరి రోజు (110) కేవలం తొమ్మిది పరుగులు జోడించి ఔటయ్యాడు. చేజ్ (55), అల్జారి జోసెఫ్ (43) రాణించారు. హెడ్ రెండు వికెట్లు పడగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 598/4 వద్ద డిక్లేర్ చేయగా.. వెస్టిండీస్ 283 పరుగులకు ఆలౌటైంది. 182/2 వద్ద ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యం సంపాదించింది.
భారత సాఫ్ట్‌బాల్ జట్టుకు లిఖిత, సంహిత, సిద్ధార్థ
ఈనాడు, హైదరాబాద్: అండర్-12 ప్రపంచ బాలబాలికల మిక్స్డ్ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టుకు లిఖిత, సంహిత, సిద్ధార్థ (తెలంగాణ) ఎంపికయ్యారు. బుధవారం నుంచి తైవాన్‌లో ఈ టోర్నీ జరుగుతుంది.
మూడో జట్టు బెంగళూరు బుల్స్
ఈనాడు, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ తొమ్మిదో సీజన్లో ప్లేఆఫ్స్ చేరుకున్న మూడో జట్టుగా బెంగళూరు బుల్స్ నిలిచింది. ఇప్పటికే జైపుర్ పింక్ పాంథర్స్, పుణెరి పల్టాన్ ముందంజ వేయగా.. తాజాగా బెంగళూరు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఆదివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 38-35 తేడాతో యూపీ యోధాస్‌పై గెలిచింది. రైడింగ్‌లో భరత్ (8), ట్యాక్లింగ్‌లో అమన్ (5) సత్తాచాటి విజయంలో కీలక పాత్ర పోషించారు. తొలి అర్ధభాగాన్ని 19-14తో ముగించిన బుల్స్.. విరామం తర్వాత కాస్త తడబడింది. పర్దీప్ (10) రైడింగ్‌లో రాణించడంతో యోధాస్ పుంజుకునేందుకు ప్రయత్నించింది. కానీ ట్యాక్లింగ్‌లో మెరుగైన ప్రదర్శనతో ప్రత్యర్థికి బుల్స్ కళ్లెం వేసింది. మరో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 38-36తో యు ముంబాను ఓడించింది. గుజరాత్ జట్టులో పార్థీక్ (13), ముంబా తరపున ప్రణయ్ (11) మెరిశారు.
అయిదో హాకీ టెస్టులో భారత్ ఓటమి
అడిలైడ్: ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన చివరిదైన అయిదో హాకీ టెస్టులో భారత్ 4-5తో పరాజయంపాలైంది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (24వ, 60వ) రెండు గోల్స్ కొట్టగా.. అమిత్ రొహిదాస్ (34వ), సుఖ్జీత్ సింగ్ (55వ) చెరో గోల్ సాధించారు. ఆస్ట్రేలియా తరఫున విఖామ్ (2వ, 17వ) రెండో గోల్స్ సాధించాడు. జలెవ్‌స్కీ (30వ), అండర్సన్ (40వ), వెటన్ (54వ) ఒక్కో గోల్ చేశారు. సిరీస్‌ను ఆస్ట్రేలియా 4-1తో గెలుచుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో 4-5, 4-7తో ఓడిన భారత్.. మూడో మ్యాచ్‌లో 4-3తో విజయం సాధించింది. నాలుగో మ్యాచ్‌లో1-5తో ఓటమి చవిచూసింది.
రన్నరప్ ఉన్నతి
దిల్లీ: ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఉన్నతి హుడా రన్నరప్‌గా నిలిచింది. మహిళల అండర్-17 సింగిల్స్ ఫైనల్లో ఆమె 18-21, 21-9, 14-21తో సరున్రాక్ చేతిలో పోరాడి ఓడింది. ఈ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారత మహిళా షట్లర్‌గా నిలిచిన ఉన్నతి బాగానే ఆడినా మూడో గేమ్‌లో కీలక సమయాల్లో తడబడి టైటిల్ చేజార్చుకుంది. పురుషుల సింగిల్స్‌లో అనీష్ 8-21, 24-22, 19-21తో సియాంగ్ (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడగా.. అండర్-17 పురుషుల డబుల్స్‌లో తుది సమరంలో అర్ష్-సంస్కార్ 13-21, 21-19, 22-24తో లాయ్ యూ-యీ హో (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం చవిచూశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
World News
Earthquake: తుర్కియే, సిరియాలో భూకంపం.. 4,500కి చేరిన మృతులు!
-
Sports News
Ravi Shastri: అశ్విన్.. అతి ప్రణాళికలు వద్దు
-
India News
చనిపోయాడనుకొని ఖననం చేశారు.. కానీ స్నేహితుడికి వీడియో కాల్!
-
Ap-top-news News
Andhra News: పన్నులు వసూలు చేసే వరకూ సెలవుల్లేవ్
-
India News
JEE Main: జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి