ఆ అంతరాన్ని మహిళల ఐపీఎల్‌ తగ్గిస్తుంది

మహిళల ఐపీఎల్‌ అంతర్జాతీయ, దేశవాళీ  క్రికెట్‌ మధ్య అంతరాన్ని తగ్గిస్తుందని భారత జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అభిప్రాయపడింది.

Published : 06 Dec 2022 02:47 IST

దిల్లీ: మహిళల ఐపీఎల్‌ అంతర్జాతీయ, దేశవాళీ  క్రికెట్‌ మధ్య అంతరాన్ని తగ్గిస్తుందని భారత జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అభిప్రాయపడింది. కొత్త క్రీడాకారిణులు దేశవాళీ నుంచి సులభంగా అంతర్జాతీయ స్థాయికి చేరుకునేందుకు ఐపీఎల్‌ దోహదపడుతుందని పేర్కొంది. తొలి మహిళల ఐపీఎల్‌ వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభమయ్యే అవకాశముంది. ‘‘మంచి క్రీడాకారిణులకు ఐపీఎల్‌ గొప్ప వేదిక అవుతుంది. అంతర్జాతీయ క్రికెట్‌ పట్ల దృక్పథం, ఆలోచన విధానం రాత్రికి రాత్రే మార్చుకోలేరు. అయితే ఐపీఎల్‌లో విదేశీ క్రీడాకారిణులతో ఆడటం వల్ల అంతర్జాతీయ క్రికెట్‌ను అర్థం చేసుకునేందుకు వేదిక లభిస్తుంది. భారత జట్టుకు ఆడుతున్నప్పుడు వాళ్లపై అదనపు ఒత్తిడి ఉండదు. ప్రస్తుతం దేశవాళీ జట్ల నుంచి ఎంపికవుతున్న వాళ్లకు కొన్నిసార్లు ఏమీ అర్థంకాదు. తమ ఆటను ఎలా మార్చుకోవాలో తెలియదు. ఆ అంతరాన్ని తగ్గించడానికి ఐపీఎల్‌ దోహదపడుతుంది. భవిష్యత్తులో ఐపీఎల్‌లో ఆడే క్రీడాకారిణుల ప్రదర్శనలో కచ్చితంగా గొప్ప మార్పు చూడొచ్చు’’ అని హర్మన్‌ తెలిపింది. ‘‘దేశవాళీ క్రికెటర్లకు ఐపీఎల్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలాంటి లీగ్‌లలో ఆడిన అనుభవం మహిళల క్రికెట్లో చాలా విషయాల్ని క్రమబద్ధీకరిస్తుంది’’ అని మరో స్టార్‌ స్మృతి మంధాన చెప్పింది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు