సెమీస్‌లో పుణెరి, జైపుర్‌

ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) తొమ్మిదో సీజన్‌లో జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌, పుణెరి పల్టాన్‌ నేరుగా సెమీస్‌కు అర్హత సాధించాయి.

Published : 06 Dec 2022 02:47 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) తొమ్మిదో సీజన్‌లో జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌, పుణెరి పల్టాన్‌ నేరుగా సెమీస్‌కు అర్హత సాధించాయి. సోమవారం గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ల్లో పుణెరి 44-30 తేడాతో పట్నా పైరేట్స్‌పై, జైపుర్‌ కూడా అంతే తేడాతో హరియాణా స్టీలర్స్‌పై గెలిచాయి. ఆకాశ్‌ (13), నబిబక్ష్ (9) పుణెరి విజయంలో కీలక పాత్ర పోషించారు. ప్రత్యర్థిని ఓ సారి ఆలౌట్‌ చేసి తొలి అర్ధభాగం ముగిసే సరికి పుణెరి 19-10తో ఆధిక్యం సాధించింది. విరామం తర్వాత కూడా జోరు కొనసాగించి 43-19తో విజయం ఖాయం చేసుకుంది. చివరి అయిదు నిమిషాల్లో పట్నా 11 పాయింట్లు సాధించి పోటీలోకి వచ్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మరోవైపు జైపుర్‌ తరపున అజిత్‌ (13) సత్తాచాటాడు. 21 మ్యాచ్‌ల చొప్పున ఆడిన జైపుర్‌, పుణెరి 79 పాయింట్లతో వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు జట్లు లీగ్‌ దశలో చెరో మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేకుండా ఈ రెండు జట్లూ టాప్‌-2తోనే లీగ్‌ను ముగిస్తాయి. అందుకే నేరుగా సెమీస్‌లో తలపడే ఛాన్స్‌ కొట్టేశాయి. లీగ్‌ దశలో తొలి ఆరు స్థానాల్లో నిలిచిన జట్లకు ప్లేఆఫ్స్‌ ఆడే అవకాశం ఉంది. అందులో తొలి రెండు జట్లు నేరుగా సెమీస్‌లో పోటీపడతాయి. మిగతా నాలుగు జట్లు ఎలిమినేటర్‌ మ్యాచ్‌ల్లో తలపడి సెమీస్‌కు అర్హత సాధించాల్సి ఉంటుంది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు