ఆ క్యాచ్‌లు ఎందుకు వదిలేశారో!

బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో కేఎల్‌ రాహుల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ క్యాచ్‌లు ఎందుకు పట్టలేదో తెలియడం లేదని టీమ్‌ఇండియా సీనియర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు.

Published : 06 Dec 2022 02:25 IST

దినేశ్‌ కార్తీక్‌

దిల్లీ: బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో కేఎల్‌ రాహుల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ క్యాచ్‌లు ఎందుకు పట్టలేదో తెలియడం లేదని టీమ్‌ఇండియా సీనియర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిన భారత్‌.. పరాభవంతో పర్యటనను భారత్‌ మొదలెట్టిన సంగతి తెలిసిందే. ఓటమి కంటే కూడా జట్టు ఓడిన తీరు అభిమానులను మరింత ఆవేదనకు గురి చేసింది. బ్యాటింగ్‌లో తేలిపోయి, బౌలింగ్‌లో చివర్లో తడబడి, ఫీల్డింగ్‌లో వైఫల్యాలతో జట్టు పరాజయం పాలైంది. ముఖ్యంగా ఆఖర్లో కీలక దశలో మెహదీ హసన్‌ క్యాచ్‌ను వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌ చేజార్చగా.. వాష్టింగన్‌ సుందర్‌ తనకు సమీపంలో పడ్డ బంతిని కనీసం అందుకునే ప్రయత్నమే చేయలేదు. ‘‘కేఎల్‌ రాహుల్‌ క్యాచ్‌ పట్టలేకపోయాడు. సుందర్‌ కనీసం బంతి దగ్గరకు కూడా రాలేదు. అతనెందుకు ప్రయత్నించలేదో తెలీదు. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో బంతి కనిపించలేదేమో తెలీదు. కానీ అతను బంతిని చూసి ఉంటే కచ్చితంగా అందుకుని ఉండాల్సింది. ఈ ప్రశ్నకు అతను మాత్రమే జవాబివ్వగలడు. మొత్తం చూస్తే ఫీల్డింగ్‌ ప్రయత్నాలు 50-50గా అనిపించాయి. ఇది జట్టుకు మంచి రోజు కాదు.. అలా అని మరీ చెత్తదేమీ కాదు. చివర్లో ఒత్తిడి కారణంగా కొన్ని బౌండరీలూ వదిలేశామనిపిస్తోంది’’ అని కార్తీక్‌ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని