గ్రాండ్‌మాస్టర్‌గా ఆదిత్య

యువ చెస్‌ ఆటగాడు ఆదిత్య మిట్టల్‌ (ముంబయి) గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించాడు.

Published : 07 Dec 2022 01:52 IST

చెన్నై: యువ చెస్‌ ఆటగాడు ఆదిత్య మిట్టల్‌ (ముంబయి) గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించాడు. జీఎం టైటిల్‌ సాధించిన 77వ భారత క్రీడాకారుడిగా ఆదిత్య ఘనత అందుకున్నాడు. స్పెయిన్‌లో జరుగుతున్న టోర్నీలో 16 ఏళ్ల ఆదిత్య 2500 ఎలో రేటింగ్‌ అధిగమించాడు. 2500 ఎలో రేటింగ్‌, మూడు జీఎం నార్మ్‌లు సాధిస్తే గ్రాండ్‌మాస్టర్‌ టైటిల్‌ లభిస్తుంది. 2021 సెర్బియా మాస్టర్స్‌లో తొలి జీఎం నార్మ్‌ అందుకున్న ఆదిత్య.. అదే ఏడాది ఎలొబ్రెగాట్‌ ఓపెన్‌లో రెండో నార్మ్‌ దక్కించుకున్నాడు. 2022 సెర్బియా మాస్టర్స్‌లో మూడో నార్మ్‌ సొంతం చేసుకున్నాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు