‘లక్ష్య’ అథ్లెట్లు అదుర్స్
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారులు తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టారు.
ఈనాడు, హైదరాబాద్: ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారులు తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టారు. మొదటి రోజు 18 పతకాలతో మెరిసిన ‘లక్ష్య’ అథ్లెట్లు మంగళవారం మరో 17 పతకాలు సాధించారు. గచ్చిబౌలీ స్టేడియంలో ముగిసిన పోటీల్లో 3 స్వర్ణ, 5 రజత, 9 కాంస్య పతకాలతో సత్తాచాటారు. మంచిర్యాలకు చెందిన రిషిత్ (అండర్-12 బాలురు, 600 మీటర్లు) రజతం, సాయి రఘువర్దన్ (అండర్-12 బాలురు, 600 మీ) కాంస్యం, సాయి కిరణ్ (అండర్-10 బాలురు, 300 మీ) స్వర్ణం, సృష్టి యోగ్యత (అండర్-10 బాలికలు, 300 మీ) స్వర్ణ పతకాలు సాధించారు. సిద్దిపేట ఆటగాడు కొండల్ అండర్-10 బాలురలో లాంగ్‌జంప్‌లో స్వర్ణం, 300 మీ పరుగులో కాంస్య పతకాలు గెలుచుకున్నాడు. రజినీకాంత్ (అండర్-10 బాలురు, లాంగ్‌జంప్) కాంస్యం, నందు (అండర్-14 బాలురు, హైజంప్) రజతం సాధించారు. నల్గొండకు చెందిన సహస్ర శెట్టి (అండర్-14 బాలికలు, 600 మీ) కాంస్యం, షేక్ సయ్యద్ (అండర్-12 బాలురు, 400 మీ) కాంస్యం, అంజలి (అండర్-14 బాలికలు, లాంగ్‌జంప్) కాంస్యం, ఆయేషా (అండర్-14 బాలికలు, హైజంప్) రజతం పతకాలు గెలుచుకున్నారు. అండర్-8 బాలురలో సాయి రుత్విక్ 50 మీ పరుగులో రజతం, స్టాండింగ్ బ్రాడ్ జంప్‌లో కాంస్య పతకాలు నెగ్గాడు. వరంగల్ అమ్మాయి పౌర్ణమి (అండర్-12 బాలికలు, లాంగ్‌జంప్) రజతం సాధించింది. నారాయణపేట ఆటగాడు బసంత్ (అండర్-14 బాలురు, 600 మీ) కాంస్యం; భద్రాద్రి కొత్తగూడేనికి చెందిన షేక్ అమ్రీన్ (అండర్-14 బాలికలు, షాట్‌పుట్) కాంస్య పతకాలు దక్కించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్