David Warner: మీ విచారణా వద్దు.. కెప్టెన్సీ వద్దు: డేవిడ్‌ వార్నర్‌

ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌కు కోపమొచ్చింది. 2018 బాల్‌ టాంపరింగ్‌ కుంభకోణం అనంతరం ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్సీ చేపట్టకుండా తన మీద పడ్డ జీవిత కాల నిషేధాన్ని తొలగించాలంటూ గత కొన్ని రోజులుగా క్రికెట్‌ ఆస్ట్రేలియాతో సంప్రదింపులు జరుపుతూ వచ్చిన వార్నర్‌..

Updated : 08 Dec 2022 09:27 IST

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌కు కోపమొచ్చింది. 2018 బాల్‌ టాంపరింగ్‌ కుంభకోణం అనంతరం ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్సీ చేపట్టకుండా తన మీద పడ్డ జీవిత కాల నిషేధాన్ని తొలగించాలంటూ గత కొన్ని రోజులుగా క్రికెట్‌ ఆస్ట్రేలియాతో సంప్రదింపులు జరుపుతూ వచ్చిన వార్నర్‌.. ఇక ఆ బాధ్యతలు తీసుకోవాలన్న ఉద్దేశమే తనకు లేదని తేల్చేశాడు. నిషేధం ఎత్తివేత కోసం ఇటీవలే రివ్యూ పిటిషన్‌ వేసిన అతను.. దీనిపై ఏర్పాటైన స్వతంత్ర ప్యానెల్‌ కేసు విచారణను బహిరంగంగా చేపట్టాలని నిర్ణయించడం పట్ల అసంతృప్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ప్యానెల్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలనూ అతను తప్పుబట్టాడు. ఈమేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సుదీర్ఘ పోస్టు పెట్టాడు. బాల్‌ టాంపరింగ్‌ ఉదంతం తర్వాత తన పడ్డ ఏడాది నిషేధం వల్ల తాను, తన కుటుంబం అయిదేళ్లుగా ఎంతో వేదన అనుభవించిందని.. అదిచాలదని ఇప్పుడు బహిరంగ విచారణ పేరుతో తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదని వార్నర్‌ స్పష్టం చేశాడు. క్రికెట్‌ మరకల్ని కడగడానికి తన కుటుంబమేమీ వాషింగ్‌ మెషీన్‌ కాదని అతను వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని