ప్రణయ్‌కు చుక్కెదురు

బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌లో భారత అగ్రశ్రేణి ఆటగాడు హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌కు చుక్కెదురైంది. పురుషుల సింగిల్స్‌ గ్రూపు-ఎ తొలి మ్యాచ్‌లో ప్రణయ్‌ పరాజయం చవిచూశాడు.

Published : 08 Dec 2022 02:59 IST

బ్యాంకాక్‌: బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌లో భారత అగ్రశ్రేణి ఆటగాడు హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌కు చుక్కెదురైంది. పురుషుల సింగిల్స్‌ గ్రూపు-ఎ తొలి మ్యాచ్‌లో ప్రణయ్‌ పరాజయం చవిచూశాడు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో మూడో సీడ్‌ ప్రణయ్‌ 12-21, 21-9, 17-21తో కొడాయ్‌ నరవొక (జపాన్‌) చేతిలో ఓటమి పాలయ్యాడు. 60 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో తొలి గేమ్‌ను చేజార్చుకున్న ప్రణయ్‌.. అనంతరం అద్భుతంగా పుంజుకున్నాడు. రెండో గేమ్‌ను ఏకపక్షంగా ముగించిన ప్రణయ్‌ మూడో గేమ్‌లో తడబడ్డాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో 15-15తో పాయింట్లు సమంగా ఉన్న సమయంలో అనవసర తప్పిదాలు ప్రణయ్‌ కొంపముంచాయి. మూడు అనవసర తప్పిదాలతో ప్రణయ్‌ మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. గురువారం జరిగే గ్రూపు-ఎ రెండో మ్యాచ్‌లో గ్వాంగ్‌ జు (చైనా)తో ప్రణయ్‌ తలపడతాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు