క్యాచ్‌ పట్టబోయి..

లంక ప్రిమియర్‌ లీగ్‌లో శ్రీలంక ఆల్‌రౌండర్‌ చమిక కరుణరత్నె గాయపడ్డాడు. నాలుగు పళ్లను కోల్పోయాడు. క్యాండీ ఫాల్కాన్స్‌, గాలె గ్లాడియేటర్స్‌ మ్యాచ్‌ సందర్భంగా ఇది జరిగింది.

Published : 09 Dec 2022 02:43 IST

కొలంబో: లంక ప్రిమియర్‌ లీగ్‌లో శ్రీలంక ఆల్‌రౌండర్‌ చమిక కరుణరత్నె గాయపడ్డాడు. నాలుగు పళ్లను కోల్పోయాడు. క్యాండీ ఫాల్కాన్స్‌, గాలె గ్లాడియేటర్స్‌ మ్యాచ్‌ సందర్భంగా ఇది జరిగింది. ఫెర్నాండో షాట్‌కు బంతి గాల్లోకి లేవగా, కరుణరత్నె దాన్ని అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆ క్రమంలో బంతి నేరుగా అతడి మూతిపై పడింది.  ఆ తర్వాత అతడు బంతిని ఒడిసిపట్టినా గాయంతో విలవిల్లాడాడు. కరుణరత్నె పళ్లు ఊడి, నోటి వెంట రక్తం వచ్చింది. వెంటనే అతణ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతడికి అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు. కరుణరత్నె పరిస్థితి నిలకడగా ఉందని, అతడు సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నాడని క్యాండీ ఫాల్కన్స్‌ జట్టు డైరెక్టర్‌ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని