ప్రణయ్‌కి మరో ఓటమి
బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో భారత ఆటగాడు హెచ్.ఎస్.ప్రణయ్‌కి మరో ఓటమి ఎదురైంది. గురువారం గ్రూపు-ఎ రెండో మ్యాచ్‌లో మూడో సీడ్ ప్రణయ్ 21-23, 21-17, 19-21తో గ్వాంగ్ జు (చైనా) చేతిలో పరాజయం చవిచూశాడు.
బ్యాంకాక్: బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో భారత ఆటగాడు హెచ్.ఎస్.ప్రణయ్‌కి మరో ఓటమి ఎదురైంది. గురువారం గ్రూపు-ఎ రెండో మ్యాచ్‌లో మూడో సీడ్ ప్రణయ్ 21-23, 21-17, 19-21తో గ్వాంగ్ జు (చైనా) చేతిలో పరాజయం చవిచూశాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ప్రణయ్ సెమీఫైనల్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించాడు. ఒక గంటా 24 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ప్రణయ్ చివరి వరకు పోరాడాడు. తొలి గేమ్‌లో ఓడినా.. రెండో గేమ్‌ను గెలుచుకుని మ్యాచ్‌లో ఆశల్ని సజీవంగా ఉంచుకున్నాడు. మూడో గేమ్ 15-15 పాయింట్లతో ఉత్కంఠభరితంగా సాగింది. 19-18తో ప్రణయ్ ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. అయితే వరుసగా మూడు పాయింట్లు గెలిచిన గ్వాంగ్.. ప్రణయ్ ఆశలపై నీళ్లు చల్లాడు. శుక్రవారం ప్రపంచ నంబర్‌వన్, ఒలింపిక్ ఛాంపియన్ విక్టర్ అక్సెల్సెన్తో ప్రణయ్ తలపడతాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Hyderabad-Vijayawada: హైదరాబాద్- విజయవాడ మార్గంలో ఆంక్షలు
-
Ts-top-news News
Ts Group-4: ముగిసిన గ్రూప్-4 దరఖాస్తు ప్రక్రియ.. ఒక్క పోస్టుకు 116 మంది పోటీ
-
Ts-top-news News
Ts High Court: న్యాయమూర్తికే నోటీసు ఇస్తారా? ఇదేం ప్రవర్తన?.. న్యాయవాదిపై హైకోర్టు ఆగ్రహం
-
Crime News
Hyderabad: ఓ భర్త ఘాతుకం.. నడివీధిలో భార్య దారుణ హత్య
-
India News
Online Betting: రూ.కోటి గెల్చుకున్న ఆనందం.. మద్యం తాగి వికృత చేష్టలు
-
India News
IndiGo: పట్నా వెళ్లాల్సిన ప్రయాణికుడు ఉదయ్‌పుర్‌కు.. ‘ఇండిగో’లో ఘటన!