రోహిత్‌ స్థానంలో ఈశ్వరన్‌!

భారత జట్టు సారథి రోహిత్‌శర్మ స్థానంలో ఇండియా-ఎ కెప్టెన్‌ అభిమన్యు ఈశ్వరన్‌ను ఎంపిక చేసే అవకాశముంది! బంగ్లాదేశ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం టీమ్‌ఇండియా జట్టులో ఈశ్వరన్‌కు చోటు కల్పించనున్నారని సమాచారం.

Published : 09 Dec 2022 02:43 IST

దిల్లీ: భారత జట్టు సారథి రోహిత్‌శర్మ స్థానంలో ఇండియా-ఎ కెప్టెన్‌ అభిమన్యు ఈశ్వరన్‌ను ఎంపిక చేసే అవకాశముంది! బంగ్లాదేశ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం టీమ్‌ఇండియా జట్టులో ఈశ్వరన్‌కు చోటు కల్పించనున్నారని సమాచారం. బంగ్లాతో రెండో వన్డేలో ఫీల్డింగ్‌ సమయంలో రోహిత్‌ ఎడమ చేయి బొటన వేలికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో టెస్టు సిరీస్‌కు రోహిత్‌ దూరమయ్యాడు. ‘‘బంగ్లాదేశ్‌లో ఎ-టెస్టు సిరీస్‌లో ఇండియా-ఎ కెప్టెన్‌ ఈశ్వరన్‌ వరుసగా రెండు సెంచరీలు సాధించాడు. అతను ఓపెనర్‌ కూడా. రెండో అనధికార టెస్టు ముగియగానే చట్‌గావ్‌లో ఈశ్వరన్‌ టీమ్‌ఇండియాతో కలవనున్నాడు’’ అని బీసీసీఐ సీనియర్‌ అధికారి తెలిపాడు. ఈశ్వరన్‌ మొదటి అనధికారిక టెస్టులో 141, రెండో మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 157 పరుగులతో సత్తాచాటాడు. గాయపడిన మహ్మద్‌ షమి స్థానంలో బంగాల్‌ పేసర్‌ ముకేశ్‌కుమార్‌ లేదా ఉమ్రాన్‌ మాలిక్‌ను జట్టులోకి తీసుకోవచ్చు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు