ప్రపంచకప్‌ ముందు పరీక్ష

టీ20 ప్రపంచకప్‌ ముందు భారత మహిళల జట్టుకు పరీక్ష. మరో రెండు నెలల్లో దక్షిణాఫ్రికాలో పొట్టి కప్పు ఆరంభం కానుండగా.. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో అమీతుమీకి భారత్‌ సిద్ధమైంది.

Published : 09 Dec 2022 02:43 IST

ఆసీస్‌తో భారత మహిళల టీ20 సిరీస్‌ నేటి నుంచే
రాత్రి 7 నుంచి

ముంబయి: టీ20 ప్రపంచకప్‌ ముందు భారత మహిళల జట్టుకు పరీక్ష. మరో రెండు నెలల్లో దక్షిణాఫ్రికాలో పొట్టి కప్పు ఆరంభం కానుండగా.. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో అమీతుమీకి భారత్‌ సిద్ధమైంది. అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో శుక్రవారం తొలి పోరు జరగనుంది. జట్టు సన్నద్ధతపై ఓ అంచనా రావడానికి ఈ సిరీస్‌ కీలకం కానుంది. ప్రధాన కోచ్‌ రమేశ్‌ పొవార్‌పై బీసీసీఐ వేటు వేసిన నేపథ్యంలో రానున్న ప్రపంచకప్‌కు జట్టు కూర్పును సిద్ధం చేసుకోవాల్సిన బాధ్యత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌, కొత్త బ్యాటింగ్‌ కోచ్‌ హృషికేశ్‌ కనిత్కర్‌లదే. హర్మన్‌, స్మృతి మంధాన, షెఫాలీవర్మ, జెమీమా రోడ్రిగ్స్‌, యాస్తికా భావియాలతో బ్యాటింగ్‌ విభాగం బలంగానే ఉంది. బౌలింగ్‌లో ఇంకాస్త పదును పెరిగితే ఆసీస్‌కు భారత్‌ గట్టి పోటీ ఇవ్వొచ్చు. మరోవైపు మెగ్‌ లానింగ్‌ గైర్హాజరీలో అలీసా హీలీ  ఆసీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని