Published : 15 Aug 2021 02:04 IST

Neeraj Chopra: నీరజ్‌ గెలుపుతో జర్మనీలో సంబరాలు

అసలు నీరజ్‌కి, జర్మనీకి సంబంధం ఏమిటంటే..

బెర్లిన్‌: ఒకసారి జర్మనీలోని ఒబెర్స్‌క్లెటెన్‌బాచ్ ప్రాంతానికి వెళ్లి చూడండి.. టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్‌త్రో విభాగంలో భారతదేశానికి స్వర్ణం పతకం తీసుకొచ్చిన నీరజ్‌చోప్రా విజయాన్ని మనలాగే వాళ్లూ అక్కడ పండగలా జరుపుకొంటున్నారు. అదేంటి.. వేరే దేశం అబ్బాయి పతకం సాధిస్తే అక్కడ సంబురాలేంటి.. అని ఆశ్చర్యపోతున్నారు కదూ! ప్రతీ విద్యార్థి విజయం వెనుక ఓ గురువు ఉన్నట్లు నీరజ్‌ చోప్రాకీ కోచ్‌లు డాక్టర్‌ క్లాస్ బార్టోనియెట్జ్(73) , ఉవెహాన్‌ (59)గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. జర్మనీకి చెందిన డాక్టర్‌ క్లాస్‌ బార్టోనియెట్జ్‌, ఉవె హాన్‌ ఇద్దరూ నీరజ్‌ చోప్రాకు కోచ్‌లుగా వ్యవహరించారు. 2018 కామన్‌వెల్త్‌, ఆసియా క్రీడల్లో నీరజ్‌ స్వర్ణ పతకాలు గెలిచిన తర్వాత అతడికి ఉవె హాన్‌ కోచ్‌గా మారారు. జావెలిన్‌ త్రోలో 100 మీటర్లకు మించి జావెలిన్‌ను విసిరిన ఏకైక అథ్లెట్‌ హాన్‌ మాత్రమే. ఆయన రికార్డును ఇప్పటి వరకు ఎవరూ బద్ధలు కొట్టలేకపోయారు. అలాంటి నిపుణుని వద్ద నీరజ్‌ శిక్షణ తీసుకున్నాడు. 2019లో నీరజ్‌ చోప్రాకు మోచేయి శస్త్ర చికిత్స తర్వాత అతనికి వ్యక్తిగత కోచ్‌గా డాక్టర్‌ క్లాస్‌ బార్టోనియెట్జ్‌ నియమితులయ్యారు. డాక్టర్‌ క్లాస్‌కు జావెలిన్‌ త్రోలో ఉండే సమస్యలు అన్ని తెలుసు. దీంతో ఈ ఇద్దరు కోచ్‌లు కలిసి నీరజ్‌ను స్వర్ణ పతక వీరుడిగా తీర్చిదిద్దారు. నీరజ్‌ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఆయన ఇటీవలే స్వగ్రామానికి చేరుకున్నారు. ఈసందర్భంగా వారిద్దరు జాతీయ మీడియాతో అనుభవాలను పంచుకున్నారు. 


ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయా 

డాక్టర్‌ క్లాస్‌ బార్టోనియెట్జ్, ఒబెర్స్‌క్లెటెన్‌బాచ్, జర్మనీ

అవును.. నీరజ్‌ చోప్రా కోసం ఏడాదిన్నర పాటు భారత్‌లోనే గడిపా. మా స్వగ్రామం జర్మనీలోని ఒబెర్స్‌క్లెటెన్‌బాచ్ ఓ చిన్న మారుమూల పల్లెటూరు. ఎత్తైన భవనాలేమీ అక్కడ కనిపించవు. ఎటు చూసినా పెంకుల గృహాలు, పచ్చని చెట్లే దర్శనమిస్తాయి. మాగ్రామంలో లోపలికి చేరాలంటే రైలెక్కి ఆపై రోడ్డు మీద ప్రయాణించాల్సి ఉంటుంది. అలానేను వచ్చేసరికి నీరజ్‌ చోప్రా ఆటతీరు గురించి ప్రజలు ప్రశంసలు కురిపించారు. నీరజ్‌ విజయంతో.. గతంలో ఎన్నడూ రాని ఫోన్‌కాల్స్‌తో అభిమానంతో పలకరించారు. ఓవర్‌ నైట్‌ స్టార్‌నైపోయా.


ఇక్కడ అదే రీతిలో స్వాగతం పలికారు

 ఉవె హాన్‌, రైన్స్‌బర్గ్, రెయిన్స్‌బర్గ్, జర్మనీ

140 కోట్ల భారతీయులు ఏవిధంగా అయితే నీరజ్‌కి స్వాగతం పలికారో.. రైన్స్‌బర్గ్ లో 8వేల ప్రజలూ నాకు అదే రీతిలో స్వాగతం పలికారు. వారందరి ముందు.. మా అమ్మ, సోదరి భారత్‌, టోక్యో, స్వర్ణ పతకం గురించే మాట్లాడారు. ఈ విజయానికి నీరజ్‌ అర్హుడు. అతడి స్ఫూర్తితో భారత్‌లో మరింత మంది అథ్లెట్లుగా మారుతారని ఆశిస్తున్నా. కేవలం జావెలిన్‌ త్రో విభాగంలోనే కాదు.. మిగిలిన క్రీడల్లో కూడా. మొదట నీరజ్‌ లాంటి ప్రతిభావంతుడికి ఎలాంటి కోచ్‌ లేరని తెలుసుకున్నాను. అప్పుడే క్లాస్‌ బార్టోనియెట్జ్ నిని పరిచయం చేశాను. క్లాస్‌ శిక్షణలో నీరజ్‌ కొన్ని టెక్నిక్స్‌ నేర్చుకుని ఆటతీరును మెరుగుపరుచుకున్నాడు.


 


Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్