అశ్విన్‌ సమయం వచ్చేసింది.. తీసుకోండి!

టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను వన్డే జట్టులోకి తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందని ఆసీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ బ్రాడ్‌ హగ్‌ అన్నాడు. బంతితో వికెట్లు తీసే అతడు ఆఖర్లో బ్యాటింగ్‌తో ఆదుకోగలడని సూచించాడు. వన్డేల్లోకి అతడిని తీసుకోవడం కోహ్లీసేనకు ఎంతో మేలు చేస్తుందని ఓ అభిమాని...

Updated : 01 Mar 2021 18:22 IST

సిడ్నీ: టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను వన్డే జట్టులోకి తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందని ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ బ్రాడ్‌ హగ్‌ అన్నాడు. బంతితో వికెట్లు తీసే అతడు ఆఖర్లో బ్యాటింగ్‌తో ఆదుకోగలడని సూచించాడు. వన్డేల్లోకి అతడిని తీసుకోవడం కోహ్లీసేనకు ఎంతో మేలు చేస్తుందని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బ్రాడ్‌ జవాబిచ్చాడు.

‘ఇది మంచి అవకాశం. అశ్విన్‌ను వన్డే జట్టులోకి తీసుకోవడం ద్వారా ఆఖర్లో బ్యాటింగ్ సామర్థ్యం పెరుగుతుంది. దాంతో టాప్‌ ఆర్డర్లో బ్యాట్స్‌మెన్‌ మరింత దూకుడుగా ఆడగలరు. పైగా యాష్‌ సమయోచితంగా వికెట్లు తీయగలడు. ఎకానమీ సైతం చాలా బాగుంటుంది. అతడిని జట్టులోకి తీసుకోండి’ అని హగ్‌ ట్వీట్‌ చేశాడు.

టీమ్‌ఇండియా తరఫున అశ్విన్‌ 111 వన్డేలు, 46 టీ20లు, 77 టెస్టులు ఆడాడు. మణికట్టు స్పిన్నర్ల రాకతో అతడిని పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీసులకు ఎంపిక చేయడం లేదు. చివరి సారిగా అతడు 2017, జూన్‌లో తెలుపు బంతి క్రికెట్‌ ‌ ఆడాడు. ఆస్ట్రేలియా సిరీసు విజయంలో కీలక పాత్ర పోషించిన యాష్‌ ఇంగ్లాండ్‌తో డే/నైట్‌ టెస్టులో 400 వికెట్ల ఘనత అందుకున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని