Shashi Tharoor: మూడో వన్డేలోనూ సంజూకి రాని అవకాశం.. శశి థరూర్ ఆగ్రహం
మూడో వన్డేలోనూ సంజూ శాంసన్‌కు తుది జట్టులో అవకాశం రాలేదు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మండిపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మెరుగైన ప్రదర్శనే చేస్తున్నప్పటికీ.. ఆ స్థాయిలో అవకాశాలు మాత్రం రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో 36 పరుగులు చేసిన సంజూను.. రెండో వన్డేలో పక్కనపెట్టేశారు. ఇక మూడో వన్డేలోనూ తుది జట్టులోకి తీసుకోలేదు. దీనిపై హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ ఇచ్చిన వివరణపై కాంగ్రెస్ ఎంపీ శశీ థరూర్ మండిపడ్డారు.
‘పంత్ 4వ స్థానంలో బాగా ఆడగలడు.. అందుకే అతడిని తీసుకున్నామని వీవీఎస్ లక్ష్మణ్ అంటున్నారు. అయితే అతడు ఫామ్ లేని మంచి ఆటగాడు.. గత 11 ఇన్నింగ్స్‌ల్లో పదింటిలో విఫలమయ్యాడు. మరోవైపు సంజూ వన్డే సగటు 66గా ఉంది. గత ఐదు మ్యాచ్‌ల్లో మంచి పరుగులు చేశాడు. ఇప్పుడు బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ గణాంకాలు తెలుసుకోండి’ అని లక్ష్మణ్‌కు థరూర్ సూచించారు.
ఇక పంత్ మూడో వన్డేలోనూ నిరాశ పరిచాడు. దీనిపై మరో ట్వీట్లో థరూర్ స్పందిస్తూ..‘పంత్ నుంచి మరో వైఫల్యం.. వైట్ బాల్ క్రికెట్ నుంచి అతడికి విశ్రాంతినివ్వాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో సంజూకి మరో అవకాశం నిరాకరించారు. తాను ఉత్తమ బ్యాటర్ అని నిరూపించుకునేందుకు సంజూ భారత టీ20 లీగ్ కోసం వేచి చూస్తున్నాడు’ అని అన్నారు. ఇప్పటి వరకూ శాంసన్ 11 వన్డేలు ఆడగా.. 66 సగటుతో మొత్తం 330 పరుగులు చేశాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Suhas: హీరోగా ఫస్ట్ థియేటర్ రిలీజ్.. సినిమా కష్టాలు గుర్తు చేసుకుని నటుడు ఎమోషనల్
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
Team India: అభిమానులూ.. కాస్త ఓపిక పట్టండి.. వారికీ సమయం ఇవ్వండి: అశ్విన్
-
World News
Pakistan: మసీదులో పేలుడు ఘటనలో 44కి చేరిన మృతులు.. ఇది తమ పనేనని ప్రకటించిన టీటీపీ!
-
Politics News
Andhra news: ప్రజల దృష్టిని మరల్చేందుకే నాపై విచారణ : చింతకాయల విజయ్
-
General News
TSPSC: ఉద్యోగ నియామక పరీక్షల తేదీలు వెల్లడించిన టీఎస్పీఎస్సీ