India vs Srilanka: బయటకు రావడం బాగుందన్న ద్రవిడ్‌

 క్వారంటైన్‌ ముగించుకొని బయటకు రావడం సంతోషకరంగా ఉందని శ్రీలంకలో పర్యటిస్తున్న టీమ్‌ఇండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నారు. రెండు వారాలకు పైగా అంతా గదులకే పరిమితం అయ్యారని పేర్కొన్నాడు....

Updated : 03 Jul 2021 17:21 IST

కొలంబో: క్వారంటైన్‌ ముగించుకొని బయటకు రావడం సంతోషకరంగా ఉందని శ్రీలంకలో పర్యటిస్తున్న టీమ్‌ఇండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నారు. రెండు వారాలకు పైగా అంతా గదులకే పరిమితం అయ్యారని పేర్కొన్నాడు. బయటకొచ్చాక మైదానంలో కలిసిన కుర్రాళ్లు ఉత్సాహంగా కసరత్తులు చేశారని వెల్లడించారు.

‘దాదాపు 17-18 రోజులు మేం క్వారంటైన్‌లో ఉన్నాం. కుర్రాళ్లు బయటకు రావడం, హుషారుగా కదలడం బాగుంది. మాకు పచ్చికతో కూడిన చక్కని బహిరంగ ప్రాంతం అప్పగించారు. అక్కడ సాధన మొదలు పెడతాం’ అని రాహుల్‌ ద్రవిడ్‌ అన్నారు.

‘బయటకు రావడంతో అందరూ ఆనందించారు. సరదా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అందరూ వాటిని ఆస్వాదిస్తున్నారు. మేం బయటకు రావడం ఇదే తొలిసారి. జట్టు మధ్య అనుబంధం పెరగడం కీలకం’ అని వైస్‌ కెప్టెన్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అన్నాడు.

జులై 13 నుంచి శ్రీలంకలో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీసులు మొదలవుతాయి. ఇందుకోసం బీసీసీఐ కుర్రాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేసింది. కెప్టెన్‌గా శిఖర్‌ ధావన్‌, వైస్‌ కెప్టెన్‌గా భువనేశ్వర్‌ కుమార్‌, కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన కోసం గబ్బర్‌ సేన ముంబయిలో తొలుత క్వారంటైన్‌ అయింది. ఆ తర్వాత కొలంబో మూడు రోజుల కఠిన క్వారంటైన్‌లో ఉంది. ఇప్పుడు సాధారణ క్వారంటైన్‌లోకి రావడంతో కుర్రాళ్లంతా సరదా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ వీడియోను బీసీసీఐ ట్విటర్లో పోస్ట్‌ చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని