Rishabh Pant: వేగంగా కోలుకుంటున్న రిషభ్ పంత్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి ఎప్పుడంటే?
గతేడాది కారు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిషభ్ పంత్ (Rishabh Pant) వేగంగా కోలుకుంటున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా, రిషభ్ పంత్ (Rishabh Pant) అభిమానులకు గుడ్ న్యూస్. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ ప్రస్తుతం ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడు వేగంగా కోలుకుంటున్నాడు. ఈ వారంలో రిషభ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతాడని సమాచారం. ‘రిషభ్ పంత్ బాగున్నాడు. వేగంగా కోలుకుంటున్నాడు. మొదటి సర్జరీ విజయవంతమైంది. అతడు ఈ వారంలో డిశ్చార్జ్ అవుతాడు’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు అన్నారు. పంత్ కుడి కాలు మోకాలి లిగ్మెంట్‌కు శస్త్రచికిత్స చేశారు. మార్చిలో పంత్‌కు రెండో శస్త్రచికిత్స చేయనున్నారు. ‘రెండో శస్త్రచికిత్స ఎప్పుడు చేయాలనే దానిపై వైద్యులు నిర్ణయం తీసుకుంటారు. పంత్‌కు వైద్యం అందించిన డాక్టర్, ఆస్పత్రితో బీసీసీఐ వైద్యం బృందం టచ్‌లో ఉంటుంది. పంత్ త్వరలోనే మైదానంలోకి అడుగుపెడతాడని మేం ఆశిస్తున్నాం’ అని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. గతేడాది డిసెంబరు 30న పంత్ కారులో దిల్లీ నుంచి రుర్కీ వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Education News
MBBS results: ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ ఫలితాలు విడుదల
-
India News
కరెంటు కోతతో కోపోద్రిక్తుడై.. డిప్యూటీ సీఎం ఇంట్లో బాంబు పెట్టానంటూ ఫోన్!
-
Movies News
Shaakuntalam: అలా నేను వేసిన తొలి అడుగు ‘శాకుంతలం’: దిల్ రాజు
-
India News
DCGI: 18 ఫార్మా కంపెనీల లైసెన్స్లు రద్దు చేసిన కేంద్రం
-
World News
North korea: కిమ్మా.. మజాకానా? లాక్డౌన్లోకి ఉత్తర కొరియా నగరం!
-
Politics News
Chandrababu: కేంద్రానికి, మీకు ప్రత్యేక ధన్యవాదాలు.. ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ