Rishabh Pant: వేగంగా కోలుకుంటున్న రిషభ్ పంత్‌.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి ఎప్పుడంటే?

గతేడాది కారు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిషభ్ పంత్ (Rishabh Pant) వేగంగా కోలుకుంటున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. 

Published : 31 Jan 2023 21:05 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా, రిషభ్ పంత్‌ (Rishabh Pant) అభిమానులకు గుడ్ న్యూస్‌. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్‌ ప్రస్తుతం ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.  అతడు వేగంగా కోలుకుంటున్నాడు. ఈ వారంలో రిషభ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అవుతాడని సమాచారం. ‘రిషభ్ పంత్‌ బాగున్నాడు. వేగంగా కోలుకుంటున్నాడు. మొదటి సర్జరీ విజయవంతమైంది. అతడు ఈ వారంలో డిశ్చార్జ్ అవుతాడు’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు అన్నారు. పంత్‌ కుడి కాలు మోకాలి లిగ్మెంట్‌కు శస్త్రచికిత్స చేశారు. మార్చిలో పంత్‌కు రెండో శస్త్రచికిత్స చేయనున్నారు. ‘రెండో శస్త్రచికిత్స ఎప్పుడు చేయాలనే దానిపై వైద్యులు నిర్ణయం తీసుకుంటారు. పంత్‌కు వైద్యం అందించిన డాక్టర్‌, ఆస్పత్రితో బీసీసీఐ వైద్యం బృందం టచ్‌లో ఉంటుంది. పంత్ త్వరలోనే మైదానంలోకి అడుగుపెడతాడని మేం ఆశిస్తున్నాం’ అని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. గతేడాది డిసెంబరు 30న పంత్ కారులో దిల్లీ నుంచి రుర్కీ వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని