Shikhar Dhawan:వన్డే ప్రపంచకప్‌లో ఎవరు ఉంటారో మాకు తెలుసు: శిఖర్‌ ధావన్

న్యూజిలాండ్‌పై మూడు టీ20 సిరీస్‌ను 1-0 తేడాతో నెగ్గిన టీమ్‌ఇండియా.. ఇప్పుడు వన్డే సిరీస్‌పై కన్నేసింది. నవంబర్‌ 25, 27, 30 తేదీల్లో భారత్, కివీస్‌ మధ్య వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి.

Published : 25 Nov 2022 01:35 IST

ఇంటర్నెట్ డెస్క్‌: న్యూజిలాండ్‌పై మూడు టీ20మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0 తేడాతో నెగ్గిన టీమ్‌ఇండియా.. ఇప్పుడు వన్డే సిరీస్‌పై కన్నేసింది. నవంబర్‌ 25, 27, 30 తేదీల్లో భారత్, కివీస్‌ మధ్య వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆక్లాండ్‌ వేదికగా జరిగే తొలి వన్డేకు సర్వం సిద్ధమైంది. టీ20 సిరీస్‌లో టీమ్ఇండియాకు హార్దిక్‌ పాండ్య నాయకత్వం వహించగా.. వన్డే సిరీస్‌కు శిఖర్‌ ధావన్‌ సారథ్యం వహించనున్నాడు. ఈ నేపథ్యంలో తొలి వన్డేకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో కెప్టెన్ ధావన్‌ మాట్లాడాడు. వన్డే ప్రపంచకప్‌నకు సన్నాహాలు ప్రారంభమయ్యాయని, ప్రపంచ కప్ జట్టులో చోటు సంపాదించుకునేందుకు ఈ సిరీస్‌ ఓ చక్కటి అవకాశమని పేర్కొన్నాడు. 

‘మేం బాగా ఆడి ఈ సిరీస్ గెలవాలని చూస్తున్నాం. యువ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఈ సిరీస్‌ చక్కటి అవకాశం. న్యూజిలాండ్‌లోని విభిన్న పరిస్థితుల్లో వారంతా తమ నైపుణ్యాలను పరీక్షించుకోవాలి. మా నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది మంచి ఛాన్స్‌. ఈ సన్నద్ధత అంతా వన్డే ప్రపంచకప్‌కి సంబంధించినది. యువ ఆటగాళ్లు చాలా బాగా రాణిస్తున్నారు. ప్రపంచ కప్ జట్టులోకి ఎవరు చేరబోతున్నారనే దానిపై మాకు మంచి అవగాహన ఉంది’ అని శిఖర్‌ ధావన్‌ అన్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని