T20 World Cup: యువ ఆటగాళ్లు పాకిస్థాన్‌పై రాణిస్తే సులభంగా గుర్తింపు వస్తుంది : కపిల్ దేవ్‌

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబరు 24న భారత్ పాకిస్థాన్‌ జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. ఈ హై వోల్టేజీ మ్యాచ్‌లో బాగా రాణించిన యువ ఆటగాళ్లకు ప్రపంచవ్యాప్తంగా సులభంగా గుర్తింపు వస్తుందని.. దాంతో పాటు..

Published : 20 Oct 2021 01:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబరు 24న భారత్- పాకిస్థాన్‌ జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. ఈ హై వోల్టేజీ మ్యాచ్‌లో బాగా రాణించిన యువ ఆటగాళ్లకు ప్రపంచవ్యాప్తంగా సులభంగా గుర్తింపు వస్తుందని.. దాంతో పాటు ఈ మ్యాచ్‌లో విఫలమైన సీనియర్లకు కూడా అదే స్థాయిలో విమర్శలు తప్పవని మాజీ క్రికెటర్‌ కపిల్ దేవ్ అన్నాడు.

‘ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఈ మ్యాచ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఒత్తిడికి గురయ్యే జట్టు ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆటను ఆస్వాదిస్తూ ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఆడే జట్టునే విజయం వరించే అవకాశం ఉంది. అలాగే, యువ ఆటగాళ్లకు ఇదో సువర్ణావకాశం. ఈ మ్యాచ్‌లో మెరుగ్గా రాణిస్తే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. దాంతో పాటు ఈ మ్యాచ్‌లో అనుభవమున్న సీనియర్‌ ఆటగాళ్లు విఫలమైతే విమర్శలు కూడా అదే స్థాయిలో వస్తాయి’ అని కపిల్ దేవ్‌ పేర్కొన్నాడు. 

2007లో టీ20 ప్రపంచకప్‌ ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు భారత్-పాక్‌ జట్లు 5సార్లు తలపడితే.. ఐదు సార్లు టీమిండియానే విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్‌లో ఇరు జట్లు ఏడు సార్లు పోటీపడగా.. అన్నిసార్లు భారత జట్టే విజేతగా నిలిచింది. దీంతో ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ 12-0తో సంపూర్ణ ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో అక్టోబరు 24న మరోసారి ఇరు జట్ల మధ్య జరుగనున్న మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని