Updated : 13/11/2021 08:48 IST

 Badminton: సరైన వ్యవస్థ ముఖ్యం: గోపీచంద్‌

‘షట్లర్స్‌ ఫ్లిక్‌’ పుస్తకం ఆవిష్కరణ

ఈనాడు - హైదరాబాద్‌

భారత క్రీడారంగం మరింత అభివృద్ధి చెందాలంటే సరైన వ్యవస్థను రూపొందించాలని జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అన్నాడు. ప్రస్తుతమున్న మౌలిక వసతుల కంటే ఎన్నో రెట్లు మంచి ఫలితాలు సాధించామని తెలిపాడు. క్రీడాకారులకు అనుగుణంగా వ్యవస్థను సిద్ధం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని గోపీచంద్‌ వివరించాడు. తన జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలు, విశేషాలతో కూడిన ‘షట్లర్స్‌ ఫ్లిక్‌.. మేకింగ్‌ ఎవ్రీ మ్యాచ్‌ కౌంట్‌’ పుస్తకాన్ని రచయిత్రి ప్రియ కుమార్‌తో కలిసి గోపీచంద్‌ రచించాడు. శుక్రవారం ఐఎస్‌బీలో మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ఈ పుస్తకావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా గోపీచంద్‌ మాట్లాడుతూ.. ‘‘జీవిత చరిత్రలా కాకుండా ప్రతి ఒక్క క్రీడాకారుడికి స్ఫూర్తినిచ్చేలా పుస్తకాన్ని తీసుకొచ్చాం. ఛాంపియన్‌ కావాలనుకునే క్రీడాకారులు, తల్లిదండ్రులు, కోచ్‌లకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆటగాడిగా, కోచ్‌గా నా ప్రయాణానికి అక్షర రూపమిచ్చాం. గత కొన్నేళ్లలో భారత క్రీడారంగం ఎంతో అభివృద్ధి చెందింది. బ్యాడ్మింటన్‌ క్రీడలో ఉన్నత శిఖరాలకు చేరుకున్నాం. ఒలింపిక్స్‌లలో వరుసగా పతకాలు సాధించాం. ఇప్పుడు మంచి వ్యవస్థను తయారు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. క్రీడాకారులకు అవసరమైన శిక్షణ, స్పోర్ట్స్‌ సైన్స్‌, మౌలిక వసతుల వ్యవస్థను సిద్ధం చేయాలి’’ అని గోపీచంద్‌ తెలిపాడు. కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌కు చేసిన సేవలు ప్రశంసనీయం. ఆయన ఆధ్వర్యంలోని అకాడమీ ఛాంపియన్ల ఫ్యాక్టరీగా నిలుస్తోంది. క్రికెట్‌కే ఎక్కువ ఆదరణ ఉన్న దేశంలో గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ను జనాల్లోకి తీసుకొచ్చారు’’ అని ప్రశంసించారు. ‘‘ఎంతోమంది తమ కెరీర్‌లో విజయవంతమవుతారు. కాని మనషులుగా పతనం అవుతారు. ఎన్నోసార్లు రాజీపడతారు. కాని రాజీపడకుండా విజయవంతం కావొచ్చని నిరూపించిన వ్యక్తి గోపీచంద్‌. ఆటగాడిగా, కోచ్‌గా, నాయకుడిగా గోపీచంద్‌ ఎదిగిన తీరును పుస్తకంలో వివరించాం’’ అని ప్రియ కుమార్‌ తెలిపింది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని