Punjab : టైటిల్‌ నెగ్గే జట్టు మాది.. అయితే ఒత్తిడిలో రాణించాల్సిందే: మయాంక్‌

టీ20 లీగ్‌ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు...

Updated : 26 Mar 2022 17:26 IST

(సోర్స్‌: మయాంక్‌ ట్విటర్‌)

ఇంటర్నెట్ డెస్క్‌: మెగా టోర్నీ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు పంజాబ్‌ కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ తెలిపాడు. మార్చి 26 నుంచి ముంబయి వేదికగా టీ20 లీగ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. నాలుగు సీజన్లపాటు పంజాబ్‌ జట్టు సభ్యుడిగా ఉన్న మయాంక్‌.. తొలిసారి సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఇప్పటి వరకు పంజాబ్‌ ఒక్క టైటిల్‌నూ నెగ్గలేకపోయింది. ఈసారి అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగుతున్నట్లు మయాంక్‌ అగర్వాల్‌ చెప్పుకొచ్చాడు. మెగా వేలంలో శిఖర్ ధావన్, కగిసో రబాడ, లియామ్ లివింగ్‌స్టోన్, జానీ బెయిర్‌స్టో, ఓడియన్‌ స్మిత్ వంటి కీలక ఆటగాళ్లను సొంతం చేసుకున్నామని తెలిపాడు. 

‘‘టైటిల్‌ నెగ్గే సత్తా ఉన్న జట్టు పంజాబ్‌కు ఉందని నమ్ముతున్నా. అయితే ఒత్తిడి సమయంలోనూ ఆటగాళ్లు అత్యుత్తమ ఆటను మైదానంలో ప్రదర్శించాలి. ఫ్రాంచైజీ పరంగా మెగా వేలంలో క్రికెటర్లను ఎంచుకోవడంలో నైపుణ్యం చూపించాం. టోర్నమెంట్ అంతా మంబయి, పుణెలో జరుగుతుందని దానికోసం ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని మెగా వేలంలో పాల్గొన్నాం. అన్ని విభాగాలను పటిష్ఠంగా తయారు చేసుకున్నాం. నేను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు ఓ బ్యాటర్‌లా మాత్రమే ఉంటా. మా జట్టులో చాలా మంది నాయకులు, అనుభవజ్ఞులు ఉన్నారు. అందుకే జట్టును నడిపించడం నాకు సులువుగా ఉంటుందేమో. జట్టును ముందుకు తీసుకు వెళ్లేందుకు మేమంతా గ్రూప్‌గా ప్రణాళికలు అమలు చేస్తాం’’ అని మయాంక్‌ వివరించాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌పై ఇప్పుడేమీ మాట్లాడలేనని, ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తారనేది మ్యాచ్‌ను బట్టి నిర్ణయం తీసుకుంటామని మయాంక్‌ అగర్వాల్ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని